మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) నటించిన భోళా శంకర్ ( Bhola Shankar ) సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆదివారం సాయంత్రం శిల్పకళా వేదికలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
మెహర్ రమేష్ ( Mehar Ramesh ) దర్శకత్వంలో చిరంజీవి తమన్నా జంటగా నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ సుశాంత్ వంటి తదితరులు కూడా కీలక పాత్రలలో నటించారు.ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇక తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత చిరంజీవి బావ అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్( Allu Aravind ).చిరంజీవి గురించి ఆయన సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ… ముందుగా ఈ భోళా శంకర్ సినిమా మంచి విజయం అందుకోవాలని నేను కోరుకుంటున్నాననీ తెలిపారు.
ఇక చిరంజీవి చూడని సక్సెస్ ఏముంది ఆయనకు మనం ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన అవసరం ఏముందని అల్లు అరవింద్ తెలిపారు.

మీరంతా ఆయన సినిమాలను చూస్తూ పెరిగితే నేను మాత్రం ఆయన సినిమాలను చేస్తూ పెరిగానని అల్లు అరవింద్ తెలిపారు.ఇక చిరంజీవిపై మీకు ఎంత అభిమానం ఉందో నాకు అంతకుమించి అభిమానం ఉందని తెలిపారు.అయితే ఆయనపై నాకు ఉన్నటువంటి అభిమానం ఏంటి అనేది మీకు చెప్పబోతున్నానని తెలిపారు.
చిరంజీవి గారు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.అయితే ఈయన చేసే సేవలను కొందరు నీచంగా మాట్లాడారని తెలిసి వారిని జైలుకు పంపించడానికి 12 సంవత్సరాలు పోరాడానని ఇది ఆయనపై నాకు ఉన్నటువంటి అభిమానం అంటూ ఈ సందర్భంగా చిరంజీవి గురించి అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.