జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు.వైసీపీ ప్రభుత్వంపై పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
రుషికొండ ప్రైవేట్ ఆస్తి కాదన్న మంత్రి బొత్స జనసేనానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.రుషికొండలో ప్రభుత్వ భవనాలు కడుతున్నామని చెప్పామన్నారు.
పర్యావరణ అనుమతుల మేరకే భవనాలు కడుతున్నామని స్పష్టం చేశారు.ఎన్నికలు వస్తున్నాయని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఎలా అని తీవ్రంగా మండిపడ్డారు.
ఇకనైనా ప్రభుత్వంపై బురద జల్లే పనులు మానుకోవాలని మంత్రి బొత్స సూచించారు.