కార్తికేయ ఫస్ట్ ఛాయిస్ నిఖిల్ కాదా... అసలు విషయం చెప్పిన అల్లరి నరేష్!

డైరెక్టర్ చందు మొండేటి(Chandu Mondeti) దర్శకత్వంలో నిఖిల్(Nikhil) ,కలర్స్ స్వాతి (Colours Swathi) హీరో హీరోయిన్లుగా 2014 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కార్తికేయ (Karthikeya)సుబ్రహ్మణ్యపురంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఈ సినిమా అప్పట్లో ఎంత సక్సెస్ అయిందో మనకు తెలిసిందే.

 Karthikeya's First Choice Nikhil Or Not Details,allari Naresh ,chandu Mondeti,ni-TeluguStop.com

అయితే ఈ సినిమా తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా గత ఏడాది కార్తికేయ 2(Karthikeya 2)సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇందులో కలర్స్ స్వాతికి బదులుగా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswran) హీరోయిన్ గా నటించారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఏకంగా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

Telugu Allari Naresh, Chandu Mondeti, Colours Swathi, Karthikeya, Nikhil-Movie

ఇలా నిఖిల్ ఖాతాలో కార్తికేయ సినిమా అతిపెద్ద విజయాన్ని అందించిందని చెప్పాలి.అయితే ఇంత మంచి సక్సెస్ సినిమాని హీరో అల్లరి నరేష్ ( Allari Naresh) వదులుకున్నారని తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అల్లరి నరేష్ కార్తికేయ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాకు ముందు అవకాశం తనకే వచ్చిందని తెలియజేశారు.

డైరెక్టర్ చందు మొండేటి ముందుగా తనకు ఈ కథ వినిపించారని అయితే ఒకే ఒక కారణంతో నేను ఈ సినిమా వదులుకున్నానని ఈ సందర్భంగా నరేష్ తెలిపారు.

Telugu Allari Naresh, Chandu Mondeti, Colours Swathi, Karthikeya, Nikhil-Movie

కార్తికేయ సినిమా సుబ్రహ్మణ్యపురంలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ నేపథ్యంలో తెరకెక్కింది.ఈ సినిమాలో ఎక్కువగా పాము సన్నివేశాలు ఉంటాయి.వ్యక్తిగతంగా నాకు పాములు అంటే చాలా భయం.కనీసం సినిమాలలో కూడా ఇలాంటి పాము సన్నివేశాలు వస్తే తాను చూడనని పాములంటే భయం ఉన్న కారణంగానే ఈ సినిమాని తాను వదులుకున్నానని ఈ సందర్భంగా అల్లరి నరేష్ కార్తికేయ సినిమా అవకాశం రావడం ఆ సినిమాని వదులుకోవడానికి కారణాలను తెలియజేశారు.ఇకపోతే కార్తికేయ వంటి సూపర్ హిట్ సినిమా నరేష్ ఖాతాలో పడి ఉండేదని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube