బంగారు బుల్లోడు ట్రైలర్ టాక్: అల్లరోడు గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడే!- Allari Naresh Bangaru Bullodu Trailer Talk

Allari Naresh Bangaru Bullodu Trailer Talk, Allari Naresh, Bangaru Bullodu, Trailer, Tollywood News - Telugu Allari Naresh, Bangaru Bullodu, Tollywood News, Trailer

టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘బంగారు బుల్లోడు’ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.ఎప్పుడో షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా కరోనా కారణంగా రిలీజ్‌ను వాయిదా వేసుకుంది.

 Allari Naresh Bangaru Bullodu Trailer Talk-TeluguStop.com

కాగా ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు అల్లరోడు రెడీ అవుతున్నాడు.పూర్తిగా కామెడీ ఎంటర్‌టైనర్ కథతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి తనదైన మార్క్ వేసుకునేందుకు ఈ హీరో ప్లాన్ చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ ఆద్యాంతం ప్రేక్షకులను అలరించే అంశాలతో ఉండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Allari Naresh Bangaru Bullodu Trailer Talk-బంగారు బుల్లోడు ట్రైలర్ టాక్: అల్లరోడు గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ ట్రైలర్‌లో సినిమా కథ ఏమిటో మనకు చెప్పేశాడు దర్శకుడు గిరి పాలిక.ఈ సినిమాలో బంగారంపై లోన్ తీసుకునేందుకు జనం బ్యాంక్‌లో తమ బంగారు నగలు పెడుతుండగా, అందులో పనిచేసే అల్లరి నరేష్ అండ్ గ్యాంగ్ తమకు కావాల్సిన వారికి ఆ నగలు ఇస్తుంటారు.

ఈ క్రమంలో చోటు చేసుకునే ఘటనలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయా అనేది సినిమా కథగా ఉండబోతున్నట్లు ఈ ట్రైలర్‌లో తెలిపారు.

మొత్తానికి ఈ సినిమాను పూర్తిగా కామెడీ ఎంటర్‌టైనింగ్ కథతో తీసుకొస్తున్న అల్లరి నరేష్, ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన పూజా ఝవేరీ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా అనిల్ సుంకర ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ సినిమాను జనవరి 23న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.కాగా అల్లరి నరేష్ నటిస్తున్న మరో చిత్రం నాంది కూడా రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే.

#Allari Naresh #Bangaru Bullodu #Trailer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు