ఈ డ్రింక్ డైట్‌లో ఉంటే ఆ జ‌బ్బుల‌న్నిటికీ దూరంగా ఉండొచ్చు!

అసలే ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది.వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం.

ఈ సీజన్లో రకరకాల వ్యాధులు చుట్టుముట్టి నానా తిప్పలు పెడుతుంటాయి.

వాటి నుంచి రక్షణ పొందాలంటే ఖ‌చ్చితంగా రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ డైట్ లో ఉంటే ఎన్నో జబ్బులకు దూరంగా ఉండొచ్చు.

మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక క్యారెట్‌ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడగాలి.

Advertisement
All Those Diseases Can Be Avoided If This Drink Is Included In The Diet Details!

ఇలా కడిగిన క్యారెట్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత రెండు ఆరెంజ్ పండ్లను తీసుకుని సగానికి కట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేయాలి.

ఇప్పుడు బ్లండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఆరెంజ్ జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, హాఫ్‌ టేబుల్ స్పూన్ అల్లం తరుగు, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే క్యారెట్ ఆరెంజ్ జ్యూస్ సిద్ధమవుతోంది.

All Those Diseases Can Be Avoided If This Drink Is Included In The Diet Details

ఈ టేస్టీ అండ్ హెల్దీ డ్రింక్ ను రోజుకు ఒకసారి గనుక తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.దాంతో సీజనల్‌గా ఇబ్బంది పెట్టే వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య పరార్ అవుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా మారుతుంది.కంటి చూపు రెట్టింపు అవుతుంది.

స‌ర‌స్వ‌తి ఆకు తింటే మేథ‌స్సు పెర‌గ‌డ‌మే కాదు ఈ లాభాలూ పొందొచ్చ‌ని మీకు తెలుసా?

చర్మం నిగారింపుగా మెరుస్తుంది.హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.

Advertisement

మరియు జీర్ణ వ్యవస్థ పని తీరు సైతం మెరుగుపడుతుంది.కాబట్టి ఈ డ్రింక్ ను పిల్ల‌లు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ డైట్ లో చేర్చుకుంటే పైన చెప్పిన లాభాలు అన్నిటినీ తమ సొంతం చేసుకోవచ్చు.

తాజా వార్తలు