ఈ నెలలోనే 'ఆదిపురుష్' ఫస్ట్ సింగిల్.. ఎప్పుడు అంటే?

డార్లింగ్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”ఆదిపురుష్” (Adipurush).ఈ సినిమాపై ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి హైప్ భారీగానే పెరిగింది.

 All Praise For Jai Shri Ram Audio From Prabhas Adipurush Movie Details, Adipurus-TeluguStop.com

తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) తెరకెక్కిస్తున్నాడు.రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటించింది.అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.ఈ సినిమా అసలు జనవరి లోనే సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది అని ఫ్యాన్స్ భావించారు.

అయితే ఈ సినిమా నుండి టీజర్ ఎప్పుడైతే రిలీజ్ చేసారో అప్పటి నుండి ఆదిపురుష్ కు కష్టాలు స్టార్ట్ అయ్యాయి.

ఈ సినిమాపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.ఇంత భారీ బడ్జెట్ సినిమా కూడా విఎఫ్ఎక్స్ అంత దరిద్రంగా ఉండడం ఏంటని ఫ్యాన్స్ సైతం ఓం రౌత్ మీద ఫైర్ అయ్యారు.దీంతో టీమ్ వెనక్కి తగ్గి మళ్ళీ విఎఫ్ఎక్స్ వర్క్ కొత్తగా చేయడం స్టార్ట్ చేసి ఈ సినిమా రిలీజ్ ను జూన్ 16కు వాయిదా వేశారు.

ఇక ఈ సినిమా నుండి ప్రమోషన్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా పోస్టర్స్ తో సరిపెడుతున్న మేకర్స్ రీసెంట్ గా జై శ్రీరామ్ సాంగ్ (Jai Sriram Song) చిన్న బిట్ ను అఫిషియల్ గా రిలీజ్ చేసారు.ఈ పాట రామ భక్తులను అమితంగా నచ్చేసింది.ఈ సాంగ్ ప్రోమో చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు.

తాజాగా వస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సాంగ్ ఈ ఏప్రిల్ చివరిలో రిలీజ్ చేయనున్నట్టు టాక్.మొత్తానికి ఫస్ట్ సింగిల్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube