ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో రాత్రంతా హైడ్రామా వాతావరణం ఏర్పడింది.అర్ధరాత్రి ఎంసీడీ హౌస్ లో కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు.
ఈ క్రమంలోనే స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక రసాభాసగా మారింది.దీంతో 13 సార్లు వాయిదా వేశారని తెలుస్తోంది.
ఆప్, బీజేపీ కౌన్సిలర్లు ఒకరికొకరు తోసుకుంటూ పేపర్లు విసురుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.బీజేపీ కౌన్సిలర్లు తనపై దాడికి యత్నించారని మేయర్ షెల్లీ ఓబరాయ్ ఆరోపిస్తున్నారు.
స్టాండింగ్ కమిటీలో మొత్తం ఆరు స్థానాలుండగా ఆప్ 3, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించారు.ఆరో స్థానం కోసం ఇరు పార్టీల మధ్య పోరు కొనసాగుతుంది.
ఎంసీడీలో ఆందోళనల పర్వం కొనసాగుతుండటంతో నాటకీయ పరిస్థితులు నెలకొన్నాయి.







