అందరి చూపులు ఈ స్టార్ హీరో మీదనే.. మరి వారి ఆశలు నెరవేరుస్తాడా?

బాలీవుడ్ కింగ్ ఖాన్ ప్రెసెంట్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు.అయితే ఈయన మాత్రం కమర్షియల్ హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది.

 All Eyes On Shah Rukh Khan Can He Deliver Big, Pathaan Movie, Shah Rukh Khan, De-TeluguStop.com

షారుఖ్ ఖాన్ చేసిన సినిమాలన్నీ వరుస ప్లాప్స్ అందుకుంటున్నాయి.ఆయన చివరిసారిగా జీరో సినిమాతో వచ్చాడు అయితే ఈ సినిమాతో భారీ ప్లాప్ అందుకోవడమే కాదు జీరో సినిమాతో వచ్చి జీరో అయ్యాడు అంటూ విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు.

ఈ సినిమా దెబ్బతో కింగ్ ఖాన్ ఏకంగా 4 ఏళ్ల గ్యాప్ ఇచ్చి మరీ ఇప్పుడు కొత్త సినిమాతో రాబోతున్నాడు.సాలిడ్ హిట్ తో ఈసారి మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకోవాలని ఆశ పడుతున్నాడు.

ఇటీవల కాలంలో బాలీవుడ్ లో ఏ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది లేదు.ప్రతీ సినిమాను ప్రేక్షకులు ప్లాప్ చేస్తూ వారికీ పరీక్ష పెడుతున్నాడు.

ప్రెసెంట్ ఈయన నటిస్తున్న సినిమాల్లో పఠాన్ ఒకటి.యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందించారు.బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో షారుఖ్ కు జోడీగా దీపికా నటిస్తుంది.ఇక ఇటీవలే ఈ సినిమా నుండి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అయిన విషయం తెలిసిందే.దీంతో అందరి ద్రుష్టి స్పై థ్రిల్లర్ పఠాన్ సినిమాలో నటించిన షారుఖ్ ఖాన్ మీద పడింది.ఈ సినిమా ట్రైలర్ కు అన్ని వర్గాల వారి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

ట్రైలర్ లాగా సినిమా కూడా ఆశాజనకంగా ఉంటే కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు.ఈ 25నెల న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో అయిన బాలీవుడ్ కు గత వైభవం లభిస్తుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube