Alia Bhatt : ఫ్రెండ్ పెళ్లిలో అలియా భట్ కట్టుకున్న చీర ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!!

డబ్బున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్లకు ఉన్న డబ్బుని వారు వేసుకునే బట్టల్లో నగల్లో చూపిస్తూ ఉంటారు.లగ్జరీ లైఫ్ ని( Luxury Life ) లీడ్ చేస్తూ బతికితే ఇలా బతకాలి అనేలా ఉంటారు.

 Alia Bhatt Stunning Yellow Saree Costs Two And Half Lakh Rupees Pics Viral-TeluguStop.com

ఇక మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే చాలా లగ్జరీగా బతుకుతారు.వారు వేసుకునే చెప్పుల నుండి పెదాలకు పెట్టుకునే లిప్స్టిక్ వరకు ప్రతి ఒక్కటి చాలా ఖరీదైనవి మెయింటైన్ చేస్తూ ఉంటారు.

అయితే చాలామంది సెలబ్రిటీలు వారు వేసుకునే బట్టల ఖరీదు లక్షల్లో కోట్లలో ఉంటుంది.అంతేకాదు చేతికి పెట్టుకునే వాచ్ ల విలువనే కోట్ల ఖరీదు చేస్తుందంటే సెలబ్రిటీలు ఎంత లగ్జరీ లైఫ్ ని మెయింటైన్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా అలియా భట్ (Alia Bhatt) కట్టుకున్న చీర ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.

Telugu Alia Bhat, Alia Bhatt, Alia Bhatt Cost, Bollywood, Disha Marraige, Ranbir

ఇక అలియా భట్ రీసెంట్ గా తన ఫ్రెండ్ దిశా (Disha) పెళ్లిలో మెరిసింది.ఇక ఈ పెళ్లిలో అందరి చూపు అలియా కట్టుకున్న చీర(Alia Bhatt Saree) మీదే పడింది.ఎందుకంటే ఆ చీర చాలా స్పెషల్ గా ఉంది.

అలాగే ఆ చీరకు తగ్గట్టు అలియా భట్ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా సెట్ అయింది.ఇక అలియా భట్ ఎల్లో కలర్ ఆర్గాంజా సారీ లో దేవ కన్యలా మెరిసిపోతుంది.

అలియా భట్ కట్టుకున్న ఎల్లో కలర్ చీర బార్డర్ మీద పక్షులు, పువ్వులు, ఆకుల కి సంబంధించిన డిజైన్ ఉంది.అలాగే చీరలో అప్లిక్ వర్క్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

Telugu Alia Bhat, Alia Bhatt, Alia Bhatt Cost, Bollywood, Disha Marraige, Ranbir

ఇక ఈ సారీ కి తగ్గట్టుగా స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని చాలా అందంగా రెడీ అయింది.ఇక ఈ చీరకు తగ్గట్టే హెయిర్ స్టైల్ తో పాటు చెవి పోగులు, అలాగే మెడలో ముత్యాల చౌకర్ ని ధరించింది.అలియా భట్ (Alia Bhatt) కట్టుకున్న చీర మీదే ఆ ఫంక్షన్ లో అందరి కళ్ళు పడ్డాయి.ఇక చీర ఖరీదు తెలిస్తే మాత్రం మీరందరూ కళ్ళు తేలేయాల్సిందే.

ఎందుకంటే ఆ చీర ఖరీదు అక్షరాల రెండున్నర లక్షలు.ఇక ఈ చీర ఖరీదు తెలిసిన ప్రతి ఒక్కరు ఆ చీరకు 2.5 లక్షలా అని నోరెళ్ళబెడుతున్నారు.ప్రస్తుతం ఆ చీరకు సంబంధించిన ఖరీదు నెట్టింట్లో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube