Alia Bhatt : ఫ్రెండ్ పెళ్లిలో అలియా భట్ కట్టుకున్న చీర ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!!

డబ్బున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్లకు ఉన్న డబ్బుని వారు వేసుకునే బట్టల్లో నగల్లో చూపిస్తూ ఉంటారు.

లగ్జరీ లైఫ్ ని( Luxury Life ) లీడ్ చేస్తూ బతికితే ఇలా బతకాలి అనేలా ఉంటారు.

ఇక మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే చాలా లగ్జరీగా బతుకుతారు.వారు వేసుకునే చెప్పుల నుండి పెదాలకు పెట్టుకునే లిప్స్టిక్ వరకు ప్రతి ఒక్కటి చాలా ఖరీదైనవి మెయింటైన్ చేస్తూ ఉంటారు.

అయితే చాలామంది సెలబ్రిటీలు వారు వేసుకునే బట్టల ఖరీదు లక్షల్లో కోట్లలో ఉంటుంది.

అంతేకాదు చేతికి పెట్టుకునే వాచ్ ల విలువనే కోట్ల ఖరీదు చేస్తుందంటే సెలబ్రిటీలు ఎంత లగ్జరీ లైఫ్ ని మెయింటైన్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా అలియా భట్ (Alia Bhatt) కట్టుకున్న చీర ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.

"""/" / ఇక అలియా భట్ రీసెంట్ గా తన ఫ్రెండ్ దిశా (Disha) పెళ్లిలో మెరిసింది.

ఇక ఈ పెళ్లిలో అందరి చూపు అలియా కట్టుకున్న చీర(Alia Bhatt Saree) మీదే పడింది.

ఎందుకంటే ఆ చీర చాలా స్పెషల్ గా ఉంది.అలాగే ఆ చీరకు తగ్గట్టు అలియా భట్ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా సెట్ అయింది.

ఇక అలియా భట్ ఎల్లో కలర్ ఆర్గాంజా సారీ లో దేవ కన్యలా మెరిసిపోతుంది.

అలియా భట్ కట్టుకున్న ఎల్లో కలర్ చీర బార్డర్ మీద పక్షులు, పువ్వులు, ఆకుల కి సంబంధించిన డిజైన్ ఉంది.

అలాగే చీరలో అప్లిక్ వర్క్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. """/" / ఇక ఈ సారీ కి తగ్గట్టుగా స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని చాలా అందంగా రెడీ అయింది.

ఇక ఈ చీరకు తగ్గట్టే హెయిర్ స్టైల్ తో పాటు చెవి పోగులు, అలాగే మెడలో ముత్యాల చౌకర్ ని ధరించింది.

అలియా భట్ (Alia Bhatt) కట్టుకున్న చీర మీదే ఆ ఫంక్షన్ లో అందరి కళ్ళు పడ్డాయి.

ఇక చీర ఖరీదు తెలిస్తే మాత్రం మీరందరూ కళ్ళు తేలేయాల్సిందే.ఎందుకంటే ఆ చీర ఖరీదు అక్షరాల రెండున్నర లక్షలు.

ఇక ఈ చీర ఖరీదు తెలిసిన ప్రతి ఒక్కరు ఆ చీరకు 2.

5 లక్షలా అని నోరెళ్ళబెడుతున్నారు.ప్రస్తుతం ఆ చీరకు సంబంధించిన ఖరీదు నెట్టింట్లో వైరల్ గా మారింది.

జుట్టు దట్టంగా పెరగాలా.. అయితే ఈ ఆయిల్ ను వాడండి!