టాలీవుడ్ జక్కన్న ఆర్‌ఆర్ఆర్ సినిమా అద్భుతమైన సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు.సినిమాకు మరియు సినిమా లో నటించిన రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో పాటు ఇంకా సంగీత దర్శకుడు కీరవాణికి ఇంకా రాజమౌళికి కూడా ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే.
కానీ సినిమా లో పెద్దగా కనిపించని అజయ్ దేవగన్ కి మరియు ఆలియా భట్ కు ఇంకా శ్రియ శరణ్ కు అవార్డులు ఇవ్వడం అంటే అది అతి అంటారు.కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఆలియా పాత్ర ఆర్ఆర్ఆర్ లో లేదని చెప్పాలి.
అలాంటి పాత్రకు ఎలా అవార్డు వచ్చిందని విమర్శించే విధంగా యూనిట్ సభ్యుల వ్యవహారం ఉంది.తాజాగా అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డులు అంటూ హెచ్ సీ ఏ స్పాట్ లైట్ అవార్డుల వేడుక లో రామ్ చరణ్ పాల్గొన్న విషయం తెల్సిందే.

చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా స్పాట్ లైట్ అవార్డుల వేడుకలో పాల్గొన్నారు.అందరి చేతిలో అవార్డులతో ఫోజ్ ఇచ్చారు.సరే వెళ్లారు కనుక అవార్డును సొంతం చేసుకున్నారు అనుకుందాం.కానీ ఆలియా భట్ కి కూడా అవార్డు ఇవ్వడం విడ్డూరంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఆలియా భట్ కు అవార్డు కావాలని ఒకటి ప్రత్యేకంగా రూపొందించారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

స్పాట్ లైట్ వారిని అడిగి మరీ ఆలియా భట్ కోసం అవార్డు తీసుకుని ఉంటారు అనేది కొందరి కామెంట్స్.మొత్తానికి ఆలియా భట్ కి కూడా ఆర్ ఆర్ ఆర్ లో నటించినందుకు అవార్డు రావడంను చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఆలియా భట్ తో పాటు స్పాట్ లైట్ అవార్డు ఎన్టీఆర్ కి దక్కింది.
ఆలియా భట్ కు ఆ అవార్డు దక్కినట్లుగా ఫొటోలు రావడంతో ఎన్టీఆర్ కు కూడా స్పాట్ లైట్ అవార్డ్ వచ్చిందనే విషయం అసంతృప్తిని కలిగిస్తుంది.







