బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణబీర్ కపూర్(Ranbir Kapoor) , అలియా భట్(Aliyabhatt) ఏప్రిల్ 14వ తేదీ వివాహం చేసుకొని అదే ఏడాది నవంబర్ నెలలో ఆడపిల్లకు జన్మనిచ్చారు.తమ బిడ్డకు రాహా(Rahaa) అనే నామకరణం కూడా చేశారు.
ఇక అలియా భట్ ప్రస్తుతం తన కూతురి ఆలనా పాలన చూసుకుంటూ ఇంట్లోనే ఉండగా రణబీర్ కపూర్ మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అలియా భట్ (Aliyabhatt)తన కూతురి గురించి తన భర్త గురించి పలు విషయాలను వెల్లడించారు.
రణబీర్ కపూర్ ఇంట్లో కనుక ఉంటే క్షణం పాటు తన కూతురిని వదిలిపెట్టి ఉండలేరని ఆయన కిటికీ వద్దకు తీసుకెళ్లి తన కుమార్తెను ఎంతో ముద్దుగా ఆడిస్తూ ఉంటారని తెలిపారు.రణబీర్ ఇంట్లో ఉంటే రాహా తన వద్దకు కూడా రాదని, ఇద్దరు కలిసి చాలా ముద్దుగా ఆడుకుంటూ ఉంటారని ఆలియా భట్ వెల్లడించారు.ఇక పనుల వల్ల మాకు ఎంత అలసట ఉన్నా తమ కుమార్తెను చూడగానే అలసట మొత్తం వెళ్లిపోతుందని తనని ఒక్కసారి హత్తుకుంటే మనసు మొత్తం తేలిక అవుతుందని అలియా వెల్లడించారు.
ఇక రణబీర్ చాలా సెన్సిటివ్ తన కుమార్తె పుట్టిన తర్వాత మరింత సెన్సిటివ్ అయ్యారు.సినిమా షూటింగ్ పనుల నిమిత్తం రణబీర్ ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే తను తిరిగి వచ్చేలోపు తన కూతురు ఎక్కడ తనని మర్చిపోతుందోనని చాలా టెన్షన్ పడుతూ ఉంటారని అలియా భట్ వెల్లడించారు.అందుకే రణబీర్ సినిమా షూటింగ్ పనులకు వెళ్లిన సమయంలో తాను రాహాను తీసుకొని కిటికీ వద్ద కూర్చుని ఆడిస్తూ తన తండ్రిని గుర్తు చేస్తూ ఉంటానని ఈ సందర్భంగా ఆలియా భట్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.