Alireza : కారుతో యాక్సిడెంట్ చేశా.. మతం చెబితే చంపేస్తారన్నారు.. అలీ రేజా కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ షో ద్వారా, సీరియళ్ల ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో అలీరేజా( Alireza ) ఒకరు.

అలీరేజా బిగ్ బాస్ షో తర్వాత వరుసగా క్రేజీ సినిమాలలో నటిస్తున్నారు.

కూతురు పుట్టాలని నేను కోరుకున్నానని కోరుకున్న విధంగా కూతురే పుట్టిందని అలీ రేజా వెల్లడించారు.మౌలాలి దర్గాకు కింద నుంచి పై వరకు మోకాళ్లపై వెళ్లానని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.2011లో బాంబే నుంచి హైదరాబాద్ కు వస్తున్నానని ఒక వ్యక్తి మందు తాగి బైక్ పై రావడంతో నా కారుకు అతని బైక్ కు యాక్సిడెంట్ అయిందని అలీ రేజా పేర్కొన్నారు.ఆ వ్యక్తి తలకు గాయమైందని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో నేను చాలా టెన్షన్ పడ్డానని అలీ రేజా వెల్లడించారు.యాక్సిడెంట్ వల్ల రేడియేటర్ లో వాటర్ లీకైందని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించానని ఆయన కామెంట్లు చేశారు.

Advertisement

ఆస్పత్రిలో నా పేరు చెప్పి ముస్లిం( Muslim ) అని చెబితే అక్కడినుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పారని అలీరేజా పేర్కొన్నారు.ఇక్కడ ముస్లిం అని తెలిస్తే చంపేస్తారని అన్నారని ఆయన వెల్లడించారు.వాళ్లు చెప్పడంతో నేను పోలీస్ స్టేషన్ కు వెళ్లానని అలీరేజా అన్నారు.

యాక్సిడెంట్ అయిన వ్యక్తి భార్య పోలీస్ స్టేషన్ కు వచ్చి నా భర్త తాగి ఉన్నాడని ఫ్యాక్టరీ కోసం వెళ్లాడని చెప్పిందని అలీరేజా వెల్లడించారు.

పోలీసులు ఈ స్టేషన్ పరిధిలోకి రాదని అన్నారని ఆయన చెప్పుకొచ్చారు.ఆ తర్వాత ఆ వ్యక్తి కోలుకున్నాడని అలీ రేజా అన్నారు.ఆపరేషన్ వాలంటైన్ సినిమాలో అలీ రేజా కీలక పాత్రలో నటించారు.

అలీ రేజా చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట
Advertisement

తాజా వార్తలు