భారత విద్యార్థులకు కువైట్ కాలేజీ గుడ్ న్యూస్....ఇన్ని ఆఫర్లా...!!!

భారత్ నుంచీ ఉన్నత విద్య కోసం ఎంతో మంది విద్యార్ధులు వివిధ దేశాలకు వలసలు వెళ్తూ ఉంటారు.

అధిక శాతం మంది విద్యార్ధులు అగ్ర రాజ్యం అమెరికా, బ్రిటన్, సింగపూర్ లకు వెళ్తుంటారు.

అయితే కరోనా విపత్కర సమయంలో పలు దేశాలు విదేశీ విద్యార్ధులపై పలు ఆంక్షలు పెడుతున్న నేపధ్యంలో భారత్ నుంచీ అమెరికా వంటి దేశాలకు వెళ్లి చదువుకునే వారి సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతోంది.ఈ క్రమంలో బ్రిటన్ విద్యార్ధులను ఆకర్షించుకోవడానికి పలు రాయితీలు ఇచ్చి భారత విద్యార్ధులను తమవైపు తిప్పుకోవడంలో విజయం సాధిస్తోంది.

ప్రస్తుతం భారత విద్యార్ధులను ఆకర్షించే పనిలో పడ్డాయి కువైట్ లోని ప్రముఖ కాలేజీలు.ఈ క్రమంలోనే కువైట్ లోని హయ్యార్ ఎడ్యుకేషన్ కాలేజీ అల్గోన్ క్వీన్ భారత విద్యార్ధుల కోసం భంపర్ ఆఫర్ ప్రకటించింది.

ఇండియన్ కమ్యూనిటీ నుంచీ వచ్చే విద్యార్ధులకు స్కాలర్ షిప్ తో పాటుగా ట్యూషన్ ఫీజులో రాయితీలు కల్పిస్తామని ప్రకటించింది.ఈ కళాశాల ప్రధానంగా బిజినెస్, అడ్వాన్స్ టెక్నాలజీ రంగాలలో పలు రకాల డిప్లమో కోర్సులు అందిస్తుస్తోంది.

Advertisement
Kuwait College Good News For Indian Students,Kuwait College, Indian Students,Ab

పలు దేశాల కళాశాలలు, యూనివర్సిటీలు భారత విద్యార్ధులకు తమవైపుకు ఆకర్షిస్తున్న నేపధ్యంలో భారత విద్యార్ధులకు మూడు రకాల రాయితీలు అందించడానికి సిద్దమయ్యింది.

Kuwait College Good News For Indian Students,kuwait College, Indian Students,ab

తమ కళాశాలలో చదువుకునే ఇండియన్ కమ్యూనిటీ కి చెందిన వారికి ట్యూషన్ ఫీజులో 20 శాతం డిస్కౌంట్ ఇస్తామని అలాగే జీపీఏ 3.5 సాదించిన విద్యార్ధులకు తరువాత సెమిస్టర్ కు 20 శాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది.దీని ప్రకారం భారత విద్యార్ధులు తాము కట్టే ట్యూషన్ ఫీజులో కేవలం 60 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవలకునే విద్యార్ధులు భారత రాయబార కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు