ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది రకరకాల కారణాలతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.యువత ఎక్కువమంది గేమ్ కు అలవాటుపడి ఆన్లైన్లోనే గడుపుతున్నారు.
గతంలో కొన్ని గేమ్స్ రావడం వల్ల వాటికి నెట్టింట్లో చాలా పాపులారిటీ వచ్చింది.వాటి వ్యామోహంలో పడి చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారు.
ఇప్పుడు మరో గేమ్ మన ముందుకు వచ్చింది.కొన్ని రోజులకు ముందు బ్లూ వేల్ వంటి గేమ్స్ నెట్టింట్లో హడావిడి చేశాయి.
ఆ గేమ్స్ పిచ్చిలో పడి చాలా మంది తమ కాళ్లు, చేతులను విరగ్గొట్టుకున్నారు.ఇప్పుడు వచ్చిన మిల్క్ క్రేట్ ఛాలెంజ్ గేమ్ మాత్రం పిల్లలకు చుక్కలు చూపిస్తోంది.
ఈ గేమ్ పేరు మిల్క్ క్రేట్.ఈ గేమ్ ని టిక్ టాక్ తీసుకొచ్చింది.
ఇందులో గేమ్ ఆడుతూ వీడియోలు తీసుకుని టిక్ టాక్ లో అప్లోడ్ చేయవచ్చు.అదే ఈ గేమ్ స్పెషాలిటీ.
ఈ గేమ్ ఆడుతున్నప్పుడు చాలామందికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి.అమెరికాలో ఈ గేమ్ లో ఆడిన వారు చాలామంది తమ కాళ్ళు చేతులను విరగొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
అందుకే అమెరికాలో ఈ గేమ్ ని బ్యాన్ చేయాలని వైద్యులు ఆందోళనకు దిగారు.అయితే అప్పటికే భారీ నష్టం వాటిల్లింది.
చాలామంది సోషల్ మీడియాలో గేమ్ వీడియోలు పోస్ట్ చేశారు.దీంతో టిక్ టాక్ లో ఈ గేమ్ చాలా పాపులర్ అయ్యింది.
ఈ గేమ్ చాలా సులభం కాదు.పాల ప్యాకెట్ల క్రేట్ ఉపయోగించి ఈ గేమ్లో ఆడాల్సి ఉంటుంది.మొదటగా క్రేట్ తీసుకుని వాటిని పిరమిడ్ ఆకారంలో నిలబెట్టాలి.ఆ తర్వాత ఒక వైపు నుండి దాన్ని పైకి ఎక్కుతూ మరోవైపు దిగాలి.
పాల ప్యాకెట్లు క్రేట్లు అంత బలంగా ఉండవు.వాటిపై దిగుతున్నప్పుడు సపోర్ట్ లేకపోవడంవల్ల అవి పక్కకు ఒరిగిపోయే ప్రమాదం ఉంది.ఆ సమయంలో మనుషులు కింద పడిపోతారు.ఆ దెబ్బకు కాళ్లు, చేతులు కూడా విరిగిపోతాయి.ఈ గేమ్ ఆడి నూటికి 95 మంది కింద పడిపోయిన దాఖలాలు చాలానే ఉన్నాయి.అంతేకాదు చావుకు దగ్గరగా వెళ్లిన వారు కూడా ఈ గేమ్ లో ఉన్నారు.
అందుకే ఈ గేమ్ ను బ్యాన్ చేయాలని చాలామంది ట్వీట్ చేశారు.ఇప్పుడు ఈ గేమ్ మన దేశంలో కూడా భయాందోళనలు రేపుతోంది.
ఎక్కడ తమ పిల్లలు కాళ్ళు, చేతులు విరగ్గొట్టుకుంటారోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.