అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజు రోజుకి విస్తరిస్తోంది.గడిచిన నెల రోజుల కాలంలో దాదాపు 2 కాల్పుల ఘటనలో అమెరికాలో పెను సంచలనం సృష్టించాయి.
ఇప్పటికే ఆ ఘటనల నుంచీ తేరుకోలేదు అమెరికా ప్రజలు.అయితే తాజాగా అమెరికాలోని వాషింగ్టన్ లో జరిగన ఓ సంఘటన మరింత కలకలం సృష్టిస్తోంది.
ఎందుకంటే ఆ కాల్పులు జరిపినది ఓ మైనర్ బాలుడు కావడమే.
అమెరికాలోని వాషింగ్టన్ లోని అలబామాలో ఉంటున్న ఐదుగురు కుటుంబ సభ్యుల్ని అదే కుటుంబానికి చెందిన పద్నాలుగేళ్ల మైనర్ బాలుడు తుపాకీతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపి చంపేశాడు.
ఆ తర్వాత తానే పోలీసులకు సమాచారం అందించి లొంగిపోయాడు.ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా పోలీసులు తెలిపారు.

మైనర్ బాలుడు ఉపయోగించిన తుపాకీ ఎంతో అధునాతనమైనదని, శక్తివంతమైనదని పోలీసులు తెలిపారు.నేరం తాను చేశానని ఒప్పుకున్న బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేయడం ప్రారంభించారు.కానీ ఇప్పటికీ కుటుంబ సభ్యులను ఎందుకు తాను చంపాడు అనే విషయాన్ని మాత్రం అల్లుడు వెల్లడించకపోవడం గమనార్హం.అంతటి అధునాతన టెక్నాలజీ గల తుపాకీ అతని చేతికి ఎలా వచ్చిందనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు పోలీసులు.







