స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు క్యూ కట్టారు.
ఇక ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా రావడంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్‌గా నిలిచింది.ఈ సినిమాతో బన్నీ తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.
ఇక ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం ఈ సినిమా సక్సెస్‌కు ముఖ్య కారణమని చెప్పాలి.థమన్ తన కెరీర్ బెస్ట్ మ్యూజిక్‌ను ఈ సినిమాకు అందించడంతో ఈ సినిమాలోని పాటలు ఎవర్‌గ్రీన్ హిట్‌లుగా నిలిచాయి.
ఇక ఈ సినిమాలో సామజవరగమనా, రాములో రాములా, బుట్ట బొమ్మా పాటలు సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ లేపాయో అందరికీ తెలిసిందే.కాగా బుట్ట బొమ్మా పాట తాజాగా యూట్యూబ్‌లో ఏకంగా 400 మిలియన్ వ్యూల మార్క్‌ను దాటి ఔరా అనిపించింది.
ఈ పాటకు థమన్ అందించిన బాణీలు సూపర్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఈ పాటను పదేపదే వీక్షిస్తున్నారు.
మొత్తానికి బన్నీ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని బుట్ట బొమ్మా పాట ఇలా సెన్సేషన్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుండటంతో ఈ పాట ఇంకా మున్ముందు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఏదేమైనా ఈ సినిమాతో బన్నీ తన స్థాయిని మరింత మెరుగుపర్చుకోవడమే కాకుండా ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ హిట్‌ను తన పేరుపై నమోదు చేసుకున్నాడు.ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ పాట ఇప్పుడు హాఫ్ బిలియన్ రికార్డుపై కన్నేసింది.మరి ఈ పాట హాఫ్ బిలియన్ రికార్డును ఎప్పుడు అధిగమిస్తుందో చూడాలి.







