తాజాగా ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన టువంటి చిత్రం అల వైకుంఠపురములో.ఈ చిత్రంలో హీరోగా మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించగా బన్నీ సరసన పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ నటించారు.
అలాగే ఈ చిత్రంలో నేను హీరో సుశాంత్, సునీల్, టబు, జయరామ్, మురళి శర్మ వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.
అయితే తాజాగా ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ ఫామ్ హక్కులను ప్రముఖ టెలివిజన్ సంస్థ జెమిని దక్కించుకుంది.
అయితే ఇందుకుగాను సంబంధించినటువంటి ధరలు అధికారికంగా వెల్లడించలేదు కానీ భారీ రేటుకు ఈ చిత్రాన్ని కొనుగోలు చేసినట్లు జెమిని సంస్థ అధికారులు చెబుతున్నారు.అయితే ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్రహ్మాండమైన వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది.
అంతేకాక ఇప్పటికే ఇతర దేశాల్లో బాహుబలి వసూళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టింది.దీంతో అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధికంగా వసూలు సాధించినటువంటి చిత్రంగా అల వైకుంఠ పురములో నిలిచింది.

అయితే ఇది ఇలా ఉండగా ఈ చిత్రం జమిని అనుబంధ సంస్థ అయినటువంటి సన్ నెక్స్ట్ లో ఏప్రిల్ 8వ తారీఖున నుంచి ప్రసారం కాబోతోంది.ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అలాగే తన తదుపరి చిత్రంపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.







