Akkineni Nageswara Rao : అక్కినేని చేసిన పనికి ప్రతి ఒక్కరు సలాం కొట్టాల్సిందే !

సినిమా ఇండస్ట్రీ( Tollywood ) రోజుకొక కొత్త పుంతలు తొక్కుతున్న రోజులు ఇవి.

సినిమా హీరో అయిపోయారంతా అంత వారే అన్నట్టుగా వీరాభిమానులు, వీర భజనలు చేస్తున్నారు.

డబ్బులు పెట్టి సినిమా తీసే నిర్మాత అయినా, క్రియేటివిటీ చూపిస్తే దర్శకత్వం చేస్తున్న దర్శకుడు అయినా కూడా హీరో తర్వాతే అన్నట్టు గా వ్యవహరిస్తున్నారు.ఇక అభిమాన సంఘాలు లాంటి వాటి గురించి ఎంత మాట్లాడిన సరిపోదు.

అందుకే సినిమా( Movie ) అంటే అందరికి మొదట హీరో మాత్రమే గుర్తు వస్తున్నాడు.కానీ గతంలో ఇలా ఉండేది కాదు.

దర్శక నిర్మాతలు ఏం చెప్తే అదే వినేవారు హీరో అయినా, మరొకరు అయినా.నెల జీతాలకు పని చేసి పని వాళ్ళ లాగానే ఉండేవారు.

Advertisement

మనల్ని పోషించి సినిమా ఇచ్చి హీరోలను చేసిన వారికి మర్యాద ఇవ్వాలనేది అప్పటి నటీనటులు పెట్టుకున్న నియమం.కానీ ఇప్పుడేమో నిర్మాత వస్తే కనీసం లేచి కూర్చునే సంస్కృతి కూడా లేదు.ఇక కథలో వేలు పెట్టడం, డైరెక్షన్ లో కాలు పెట్టడం వంటి వాటికి కొదవే లేదు.

ఒకవేళ దర్శకుడు ఇలా కళ్లు, వేళ్ళు పెట్టనివ్వకపోతే హీరోలే సొంత కథలతో, డైలాగ్స్ తో సినిమాలు చేసుకుంటున్నారు.నాటి నేటి తరాలకు ఇలాంటి ఇబ్బంది ఉంటుందని అక్కినేని నాగేశ్వర రావు( Akkineni Nageswara Rao ) గారు ఆనాడే ఊహించారు.

ఆయన వచ్చే తరాలు పద్ధతులు మర్చిపోకూడదు అని అక్కినేని కొన్ని నియమాలను పెట్టుకున్నారు.

ఆ సంఘటన గురించి దర్శకుడు కోదండరామి రెడ్డి( Director Kodandarami Reddy ) ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.అక్కినేని తో కోదండరామి రెడ్డి ఒక సినిమా తీస్తున్న రోజులు అవి.ఒక రోజు షూటింగ్ గ్యాప్ లో ఆయన ఎందుకో బయటకు వచ్చారు.అయన రాగానే అక్కినేని వారు లేచి నిల్చొని పక్కకు వెళ్లారట.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

అక్కినేని( Akkineni ) ఎదో పనిలో అలా వెళ్లి ఉంటారని అనుకున్నారట కోదండరామి రెడ్డి.ఆ తర్వాత మళ్లి కాసేపటికి బయటకు వస్తే మళ్లి లేచి నిలబడ్డారట.

Advertisement

అది చూసి కంగారు పడిన కోదండరామి రెడ్డి ఏంటండీ ఇది మీ అనుభవంలో సగం వయసు లేదు నాకు ఎందుకు ఇలా నిల్చుంటారని అడిగితే నేను ఇలా చేస్తే ముందు తరాలు డైరెక్టర్ ని గౌరవం ఇస్తారని చెప్పారట.అది నటీనటులు డైరెక్టర్ కి ఇవ్వాల్సిన గౌరవం.

తాజా వార్తలు