నాగార్జున ఊరికే ఏమీ లేడు తెలుసా.. అంతా జరుగుతూనే ఉందట!

టాలీవుడ్ కింగ్ నాగార్జున గత ఏడాది ది ఘోస్ట్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చిన విషయం తెలిసిందే.ఆ సినిమా ఫ్లాప్ అవడం తో నాగార్జున గత కొంత కాలంగా ఖాళీ గా ఉంటున్నాడని అంతా భావిస్తున్నారు.

 Akkineni Nagarjuna Next Film Update , Akkineni Fans, Nagarjuna, Prasanna Kumar,-TeluguStop.com

ప్రస్తుతానికి ఆయన సినిమాలు చేసే ఆసక్తి చూపించడం లేదని కూడా కొందరు అనుకుంటున్నారు.అసలు విషయం ఏంటంటే నాగార్జున ఎప్పుడు బిజీగానే ఉంటారు.

ప్రస్తుతం ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వం లో సినిమా ను చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వరకు దాదాపుగా పూర్తయింది.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ప్లాన్ చేస్తున్నారు.నాగార్జున తన సినిమా యొక్క ప్రతి విషయం లో కూడా ఇన్వాల్వ్ అవుతారు.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో కూడా నాగార్జున భాగస్వామ్యం అవుతున్నారని తెలుస్తోంది.

Telugu Akkineni Fans, Dhamaka, Nagarjuna, Prasanna Kumar, Prasannakumar, Ghost-M

ఒకటి రెండు వారాల్లోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.గత నెలలో రెండు వారాల పాటు టెస్ట్ షూటింగ్‌ జరిగిందని తెలుస్తోంది.ఆ టెస్ట్ షూట్ లో దర్శకుడు ప్రసన్న కుమార్ బెజవాడ మంచి మార్కులు సొంతం చేసుకున్నాడు.

అందుకే సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాలని నిర్ణయాన్ని తీసుకున్నారు.మొత్తానికి నాగార్జున ఆ సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ఖాళీ గా ఏమీ లేడు.సినిమా పనిలోనే ఉన్నాడు.

Telugu Akkineni Fans, Dhamaka, Nagarjuna, Prasanna Kumar, Prasannakumar, Ghost-M

కనుక అభిమానులకు ఈసారి మంచి సినిమా వస్తుందని అక్కినేని కాంపౌండ్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి.ధమాకా సినిమా కు రచన సహకారం అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ మొదటి సారి నాగార్జున తో సినిమా ను తెరకెక్కించబోతున్నాడు.దర్శకుడిగా పరిచయం కాబోతున్న ప్రసన్న కుమార్ కి ఎలాంటి ఫలితం దక్కబోతుంది.

అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్న కమర్షియల్ సక్సెస్ లభించబోతుందా అనేది చూడాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube