నాగ చైతన్య న్యూ లుక్ పై అక్కినేని ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే..!

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం హీరోగా చందు మొండేటి( Chandu Mondeti ) దర్శకత్వం లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.ఆ సినిమా కి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు వచ్చే నెలలో మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 Akkineni Naga Chaitanya New Look Goes Viral Details, Naga Chaitanya, Chandu Mond-TeluguStop.com

సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వడం కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.అంతే కాకుండా హీరో గా ఈ సినిమా తో నాగ చైతన్య( Naga Chaitanya ) కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు అంటున్నారు.

కొత్త సినిమా అనగానే నాగ చైతన్య సేమ్‌ లుక్ లో కనిపిస్తూ ఉంటాడు.కానీ ఈసారి మాత్రం చాలా విభిన్నమైన లుక్‌ లో కనిపిస్తాడనే వార్తలు వస్తున్నాయి.

Telugu Allu Aravind, Chaitu, Chandu Mondeti, Karthikeya, Naga Chaitanya, Nagacha

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చందు మొండేటి దర్శకత్వంలో గతం లో వచ్చిన కార్తికేయ 2( Karthikeya 2 ) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.కార్తికేయ 2 సినిమా తో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న దర్శకుడు చందు మొండేటి తాజా చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమా ను అల్లు అరవింద్( Allu Aravind ) నిర్మించబోతున్నాడు.తాజాగా వెంకటేష్ కూతురు వివాహ వేడుక సందర్భంగా నాగ చైతన్య కొత్త లుక్ రివీల్ అయింది.

Telugu Allu Aravind, Chaitu, Chandu Mondeti, Karthikeya, Naga Chaitanya, Nagacha

ఆ లుక్ ను చూసి చాలా మంది అక్కినేని ఫ్యాన్స్( Akkineni Fans ) పెదవి విరుస్తున్నారు.లవర్ బాయ్ గానే చైతూ బాగుంటాడు.గతంలో ఇలాంటి లుక్ లో ఒక సినిమా ను చేసి నిరాశ పరిచాడు.అందుకే ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సోషల్‌ మీడియా లో నాగ చైతన్య లుక్‌ గురించి మిశ్రమ స్పందన వస్తున్న కారణంగా సినిమా ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.చందు మొండేటి దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా లో నాగ చైతన్య కొత్తగా కనిపిచడంతో పాటు భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube