గత సంవత్సరం అక్కినేని హీరో లు నటించిన ఏ ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకోలేక పోయింది.కనీసం హిట్ టాక్ దక్కించుకున్న దాఖలాలు కూడా లేవు.
గత ఏడాది ఆరంభం లో వచ్చిన బంగార్రాజు సినిమా ఒక మోస్తరు సక్సెస్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన అక్కినేని వారి ఏ ఒక్క సినిమా కూడా విజయం సొంతం చేసుకోలేక పోయింది.గత ఏడాది విడుదలవుతుందని భావించిన అఖిల్ ఏజెంట్ సినిమా అసలు ప్రేక్షకుల ముందుకు రానే రాలేదు.
ఇక నాకు చైతన్య నటించిన సినిమా థాంక్యూ తో పాటు నాగార్జున ది ఘోస్ట్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.ఈ నేపథ్యం లో 2023 సంవత్సరం వారికి కీలకం గా మారింది.2023 సంవత్సరాన్ని అఖిల్ తన ఏజెంట్ సినిమా తో మొదలు పెట్టబోతున్నాడు.

ఆ తర్వాత రచయిత ప్రసన్న కుమార్ దర్శకత్వం లో నాగార్జున ఒక సినిమా ను చేయబోతున్నాడు.ఇక నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం లో కస్టడీ అనే సినిమా ను కూడా చేస్తున్నాడు.ఈ మొత్తం అక్కినేని వారి సినిమా లు ఫ్యాన్స్ కి ఈ సంవత్సరం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి అనే నమ్మకం తో కొందరు ధీమా తో ఉన్నారు.
ముఖ్యం గా నాగార్జున హీరో గా ప్రసన్న కుమార్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా మరియు ఏజెంట్ సినిమా లపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.నాగ చైతన్య కస్టడీ సినిమా ఎలా ఉంటుందా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ మూడు సినిమా లు కూడా తక్కువ గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతుంది.అక్కినేని ఫ్యాన్స్ కి సక్సెస్ ఈ మూడు సినిమా లతో అయినా సక్సెస్ సొంతం అవుతుందా అనేది చూడాలి.







