తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ అక్కినేని ఫ్యామిలీ గురించి ఆ ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అక్కినేని నాగేశ్వరరావు నుంచి అఖిల్ వరకు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలామంది హీరోలు మంచి గుర్తింపు తెచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.
ఇకపోతే అసలు విషయంలోకి వెళితే.అక్కినేని ఫ్యామిలీలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య.
ఇలా అందరి పేర్లకీ ముందు నాగ అనే పదం ఉంటుంది.అలా వారి పేర్లలో నాగ కలిసి వుండడానికి గల కారణం ఏంటో తాజాగా నాగార్జున చెప్పుకొచ్చారు.
అయితే అక్కినేని నాగేశ్వరరావు గారు వారి అమ్మ కడుపులో వున్నప్పుడు వారికి నాగుపాము కలలోకి వచ్చేదట.ఆ తర్వాత నాగేశ్వరరావు పుట్టిన తర్వాత కూడా తరచూ పాము పిల్లలు కనిపించేవట.
దాంతో, ఆయనకు నాగేశ్వరరావు అని నామకరణం చేశారట.అలా నాగార్జున నాగ చైతన్య పేర్ల ముందు కూడా నాగ అనే పదాన్ని యాడ్ చేశారట.
ఇకపోతే అఖిల్ పేర్లో నాగ అన్న పదం లేదేంటి అన్న విషయానికొస్తే.ఆ పేరును కూడా నానమ్మ సూచించారట.
అదేవిధంగా నాగర్జున సోదరి సుశీల పేరులో కూడా నాగ అన్న పదం యాడ్ చేయడంతో ఆమె పేరు నాగ సుశీలగా మార్చుకుందట.

అయితే మొదట నాగచైతన్య పేరుని చైతన్య అని నామకరణం చేయడంతో ఆ తరువాత పెద్దవిడ సూచన మేరకు నాగ అనే పదం యాడ్ చేయడంతో మొత్తం నాగచైతన్య పేరుని యాడ్ చేశారట అలా అని చైతన్య పేరు కాస్త నాగ చైతన్యగా మారిపోయింది.అఖిల్ పేరులో నాగ అన్న పదం లేదు అన్న విషయానికి వస్తే.ఒకసారి బిగ్‌బాస్ షోలోనూ ఇదే విషయం ప్రస్థావించచారు.
ఆయన చేతిపై పెద్ద నాగుపాము టాటూ కూడా వుంటుంది.







