'ఏజెంట్' నుండి మరో పోస్టర్.. ట్రైలర్ పై హైప్ పెంచుకున్న మేకర్స్!

అక్కినేని యువ హీరోల్లో ఒకరైన అఖిల్ అక్కినేని ( Akhil Akkineni ) ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ఏజెంట్( Agent ).

సురేందర్ రెడ్డి ( Surender Reddy ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.

అందుకే వరుసగా ఈ సినిమా నుండి ఏదొక ప్రమోషన్ కంటెంట్ వదిలి సినిమాపై హైప్ పెంచేందుకు చూస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుండి మరొక పోస్టర్ రిలీజ్ చేసారు.

ఈ పోస్టర్ కూడా మంచి ఆసక్తి రేపుతోంది.ఈ రోజు సాయంత్రం ఈ సినిమా నుండి ట్రైలర్ లాంచ్ కాబోతున్న విషయం తెలిసిందే.

మరి ఈ అవైటెడ్ ట్రైలర్ విజువల్స్ నుండి ఒక పోస్టర్ ను రిలీజ్ చేసారు.ఇదే బాగా ఆకట్టు కుంటుంది అంటే సాయంత్రం రాబోయే ట్రైలర్ ఇంకెంత ఆకట్టు కుంటుందో చూడాలి.

Advertisement

ఇదిలా ఉండగా ఇక ఏజెంట్ సినిమాను సురేందర్ 2 సినిమాస్ తో కలిసి ఏకే ఎంటెర్టాన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపిస్తుండగా.ఈయనకు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే కీలక పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు.

హిప్ హప్ తమిజా సంగీతాన్ని అందిస్తుండగా ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్ ను కూడా పూర్తిగా మార్చేసి మాస్ లుక్ లోకి మేకోవర్ అయ్యాడు.ఈయన మేకోవర్ ఫ్యాన్స్ ను అమితంగా ఆకట్టుకుంది.

మరి అఖిల్ రెండేళ్ల కష్టానికి ఈ సినిమా ఆశించిన ఫలితం ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు
Advertisement

తాజా వార్తలు