నన్ను కాపాడుబోయి డైరెక్టర్ కాలు విరగొట్టుకున్నారు... అఖిల్ కామెంట్స్ వైరల్!

అక్కినేని అఖిల్(Akhil) హీరోగా సురేందర్ రెడ్డి ( Surender Reddy) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ఏజెంట్ (Agent).ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది అయితే ఈ సినిమా ఈ నెల 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

 Akhil Akkineni About Agent Movie Director Surender Reddy Leg Injury Details, Sur-TeluguStop.com

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు ఇందులో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చారు.ఈ క్రమంలోనే ఓ మీడియా ప్రతినిధి డైరెక్టర్ ను ప్రశ్నిస్తూ షూటింగ్ సమయంలో మీకు కాలికి దెబ్బ తగిలిందని విన్నాము సాధారణంగా షూటింగ్ సమయంలో హీరోలు లేదా ఇతర ఆర్టిస్టులు దెబ్బలు తగిలించుకోవడం చూసాము కానీ మీకు ఎలా తగిలింది అంటూ ప్రశ్నించారు.

Telugu Akhil, Akhil Akkinani, Akhilsurender, Surender Reddy, Surenderreddy-Movie

ఈ ప్రశ్నకు అఖిల్ (Akhil)సమాధానం చెబుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించడం కోసం చిన్న సెట్ ఏర్పాటు చేశారు.దీనికి ఇనుప కడ్డీలు చెక్కలతో ఏర్పాటు చేసిన ఈసెట్ గాలి వస్తే పడిపోయే లాగే ఉంటుంది.ఇక ఇందులో షూటింగ్ చేస్తున్న సమయంలో గాలివీయడంతో ఈ సెట్ మొత్తం పడిపోయింది.

అయితే ఇది పడుతున్న సమయంలో ఓ చెక్క వచ్చి నా తలకి తగలగా నాకు ఎక్కడ తగులుతుందోనని సురేందర్ రెడ్డి వచ్చి తనని కాపాడారని ఆ సమయంలో ఇనుప కడ్డీ తన కాళ్లపై పడి దెబ్బ తగిలిందని అఖిల్ కి వెల్లడించారు.

Telugu Akhil, Akhil Akkinani, Akhilsurender, Surender Reddy, Surenderreddy-Movie

ఆరోజు షూటింగ్ లొకేషన్లో నాకు తగలాల్సిన దెబ్బ సురేందర్ రెడ్డి గారికి తగిలిందని నన్ను కాపాడబోయి తన్ కాలు విరిగొట్టుకున్నారు అంటూ ఈ సందర్భంగా అఖిల్ కామెంట్స్ చేశారు.అయితే తదుపరి రోజు షూటింగ్ ఉండడంతో ఆయన షూటింగుకు బ్రేక్ ఇవ్వకుండా కాలుకు కట్టు కట్టుకొని షూటింగ్ కి వచ్చారని అఖిల్ తెలిపారు.ఇలా అఖిల్ తనని కాపాడబోయే సురేందర్ రెడ్డి గాయపడ్డారంటూ చెప్పినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవడంతో సురేందర్ రెడ్డి రియల్ హీరో అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుంది.ఈ సినిమాతో అఖిల్ సక్సెస్ సాధిస్తారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube