నన్ను కాపాడుబోయి డైరెక్టర్ కాలు విరగొట్టుకున్నారు… అఖిల్ కామెంట్స్ వైరల్!

అక్కినేని అఖిల్(Akhil) హీరోగా సురేందర్ రెడ్డి ( Surender Reddy) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ఏజెంట్ (Agent).

ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది అయితే ఈ సినిమా ఈ నెల 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు ఇందులో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చారు.

ఈ క్రమంలోనే ఓ మీడియా ప్రతినిధి డైరెక్టర్ ను ప్రశ్నిస్తూ షూటింగ్ సమయంలో మీకు కాలికి దెబ్బ తగిలిందని విన్నాము సాధారణంగా షూటింగ్ సమయంలో హీరోలు లేదా ఇతర ఆర్టిస్టులు దెబ్బలు తగిలించుకోవడం చూసాము కానీ మీకు ఎలా తగిలింది అంటూ ప్రశ్నించారు.

"""/" / ఈ ప్రశ్నకు అఖిల్ (Akhil)సమాధానం చెబుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించడం కోసం చిన్న సెట్ ఏర్పాటు చేశారు.

దీనికి ఇనుప కడ్డీలు చెక్కలతో ఏర్పాటు చేసిన ఈసెట్ గాలి వస్తే పడిపోయే లాగే ఉంటుంది.

ఇక ఇందులో షూటింగ్ చేస్తున్న సమయంలో గాలివీయడంతో ఈ సెట్ మొత్తం పడిపోయింది.

అయితే ఇది పడుతున్న సమయంలో ఓ చెక్క వచ్చి నా తలకి తగలగా నాకు ఎక్కడ తగులుతుందోనని సురేందర్ రెడ్డి వచ్చి తనని కాపాడారని ఆ సమయంలో ఇనుప కడ్డీ తన కాళ్లపై పడి దెబ్బ తగిలిందని అఖిల్ కి వెల్లడించారు.

"""/" / ఆరోజు షూటింగ్ లొకేషన్లో నాకు తగలాల్సిన దెబ్బ సురేందర్ రెడ్డి గారికి తగిలిందని నన్ను కాపాడబోయి తన్ కాలు విరిగొట్టుకున్నారు అంటూ ఈ సందర్భంగా అఖిల్ కామెంట్స్ చేశారు.

అయితే తదుపరి రోజు షూటింగ్ ఉండడంతో ఆయన షూటింగుకు బ్రేక్ ఇవ్వకుండా కాలుకు కట్టు కట్టుకొని షూటింగ్ కి వచ్చారని అఖిల్ తెలిపారు.

ఇలా అఖిల్ తనని కాపాడబోయే సురేందర్ రెడ్డి గాయపడ్డారంటూ చెప్పినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవడంతో సురేందర్ రెడ్డి రియల్ హీరో అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాతో అఖిల్ సక్సెస్ సాధిస్తారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని ముగ్గురు భారతీయులు దుర్మరణం