తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు రావడంతో పాటు ఫైనల్ 5 లో ఒకరు చోటు దక్కించుకున్నారు.ఫినాలే మెడల్ టాస్క్ దాదాపుగా మూడున్నర రోజులు సాగింది.
టాస్క్ మొదటి రౌండ్ లో భాగంగా పాలు తక్కువ సేకరించినందుకు గాను అభిజిత్, అరియానా మరియు మోనాల్ లు తప్పుకున్నారు.రెండవ రౌండ్ లో భాగంగా అభిజిత్ మరియు హారికలు పూలు కలెక్ట్ చేయడంలో విఫలం అయ్యారు.
దాంతో వారిద్దరు కూడా తప్పుకున్నారు.మూడవ రౌండ్ లో సోహెల్ మరియు అఖిల్ లు నిలిచారు.
ఈ ఇద్దరు కూడా టాస్క్ ల విషయంలో రాక్షసులు అనే విషయం తెల్సిందే.అందుకే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ను వీరిద్దరు ఎంతో ఓపికగా కష్టం అయినా చేసేందుకు సిద్దం అయ్యారు.
అయితే ఇన్ని రోజులుగా సింపతి ఆట ఆడుతూ వస్తున్నాడు అంటూ అఖిల్ కు విమర్శలు ఉన్నాయి.ఇప్పుడు మళ్లీ అదే నిరూపితం చేసుకునేలా ఆయన ఫినాలే మెడల్ ను దక్కించుకున్నాడు.
సోహెల్ ఎంతో ఓర్పుగా కూర్చున్నాడు.ఇంకా రెండు రోజులు అయినా అతడు కూర్చునే సత్తా ఉంది.కాని అతడిని అఖిల్ ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసినట్లుగా అనిపించింది.అమ్మ కోరిక.
అన్న కూడా నన్ను అలా అన్నాడు అంటూ ఏదో సోహెల్ ముందు కన్నీరు పెట్టుకుంటూ అఖిల్ మాట్లాడటంతో సోహెల్ ఎమోషనల్ అయ్యాడు.అఖిల్ కోసం నేను దిగేస్తా అనుకుని దిగేశాడు.
సోహెల్ అలా చేయడం ఎంత పెద్ద త్యాగమో అతడికి తెలుసో లేదో కాని చాలా పెద్ద అవకాశంను అతడు మిస్ చేసుకున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.అఖిల్ మళ్లీ సింపతీతో ఇతరులను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి మెడల్ ను దక్కించుకున్నాడు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గేమ్ ఫైనల్ కు వచ్చిన ఈ సమయంలో కూడా ఇంకా సింపతీతోనే ఆడాలా అంటూ ట్రోల్ చేస్తున్నారు.అఖిల్ బుట్టలో పడి సోహెల్ బకరా అయ్యాడు అంటూ మీమ్స్ వస్తున్నాయి.