అజిత్ వలిమై ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసిన చిత్ర బృందం... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

హెచ్ వినోద్ దర్శకత్వంలో బోనికపూర్ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన చిత్రం వలిమై.

ఈ సినిమా దేశ వ్యాప్తంగా నిన్న విడుదలయింది.

ఇలా మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించు కుంది.అయితే నిన్న తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్‌ విడుదల కావడంతో ఈ సినిమా ప్రభావం అజిత్ సినిమాపై పడిందని చెప్పాలి.

అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అలియా నటించిన గంగు భాయ్ కూడా విడుదల కావడం వల్ల వలిమై కలెక్షన్లు క్రమంగా తగ్గే అవకాశం ఉంది.అజిత్ హీరోగా, టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్ గా నటించిన ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తమిళనాడులోనే ఫస్డ్ డే 34కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తుంది.ఇది అజిత్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా చెప్పవచ్చు.

Advertisement

అయితే మొదటి రోజే ఎంతో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు తెలుస్తోంది.

సాధారణంగా సినిమా విడుదలైన నెల రోజులకు ఓటీటీలో విడుదలవడం సర్వ సాధారణం క్రమంలోని ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 సుమారు 70 కోట్లకు ఈ సినిమా రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాని మార్చి 25 వ తేదీ నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది.అయితే ఇదే రోజే రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడం విశేషం.

Advertisement
" autoplay>

తాజా వార్తలు