కోలీవుడ్ స్టార్ హీరో అజిత్( Star Heroo Ajith ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం అజిత్ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
అజిత్ తమిళ్ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.ఈయన తన ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో మనందరికీ తెలిసిందే.
వైట్ హెయిర్ కు కలర్ వెయ్యకుండా అలాగే సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు.కేవలం కోలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్( Tollywood ) లో కూడా బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు.

అంతేకాకుండా హీరో అంటే ఇలానే ఉండాలి అనేలా ట్రెండ్ ని సెట్ చేసాడు.ఇక ప్రస్తుతం అజిత్ సినిమాలను పక్కన పెట్టి ప్రపంచాన్ని చుట్టే కార్యాక్రమాన్ని తలపెట్టాడు.ఇప్పటికే పలు రాష్ట్రాలను తిరుగుతూ అక్కడ జనాలతో అక్కడ ఆచారాలను ఫాలో అవుతూ కనిపిస్తూ ఉన్నాడు అజిత్.ఇది ఇలా ఉంటే తాజాగా అజిత్ లేటెస్ట్ ఫోటో( Ajith Latest Photo ) సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ ఫోటో ఎక్కడ తీసుకున్నది అనేది తెలియదు కానీ, సడెన్ గా చూస్తే మాత్రం ఇందులో ఉన్నది అజిత్ అని గుర్తుపట్టడానికి అభిమానులకు చాలా సమయం పడుతుంది అని మాత్రం చెప్పవచ్చు.ఎందుకంటే అజిత్ అంత దారుణంగా ఉన్నాడు.
నెరిసిన జుట్టు, గడ్డం కళ్లకింద ముడతలు, నలిగిపోయిన ముఖంతో గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు.

అజిత్ వయస్సు 52 కాగా ఆ ఫొటోలో మాత్రం 70 లా కనిపిస్తున్నాడు.దీంతో అతనికి ఏదో హెల్త్ ప్రాబ్లెమ్( Ajith Health Problem ) ఉందని అభిమానులు కంగారు పడుతున్నారు.ఇంకొందరు ఏమో ప్రయాణాలు చేస్తూ ఉండడంతో ఇలా ముఖం వడిలిపోయిందని చెప్పుకొస్తున్నారు.
ఇంకొందరు నెటిజన్స్ ఒరిజినాలిటీ అదే కానీ సినిమాలో మేకప్ చేసుకుని కవర్ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఆ ఫోటోలో అజిత్ గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు.