తమిళ స్టార్ హీరో తల అజిత్ కుమార్( Hero Ajith ) గురించి మనందరికీ తెలిసిందే.తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా ఆ తర్వాత స్థానంలో అజిత్, దళపతి విజయ్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
హీరో అజిత్ కి తమిళంలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈరోజు అజిత్ నటించిన సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే థియేటర్ లు జాతరను తలపిస్తూ ఉంటాయి.
యంగ్ హీరో దళపతి విజయ్ కి పోటీగా నిలుస్తూ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.

ఇక అజిత్ నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ మాస్టర్ హిట్టుగా నిలవడంతో పాటు కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాయి.ఇకపోతే సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన లైఫ్ ను ఎంతో సింపుల్గా జీవించేందుకు ఇష్టపడుతూ ఉంటారు అజిత్.కాగా హీరో అజిత్ కు రైడింగ్ అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇటీవలే దేశంలోని ప్రధాన నగరాలను చుట్టొచ్చారు అజిత్.ఇండియాకు పొరుగున ఉన్న నేపాల్, భూటాన్‌తో పాటు యూరప్ లోని కొన్ని సిటీల్లోనూ బైక్‌పై విహార యాత్ర చేశారు.
అయితే నేపాల్‌లో అజిత్ బైక్ టూర్లో ఉండగా తోటి రైడర్ సుగత్ సత్పతి( Sugat Satpathy ) ఆయనకు సాయంగా నిలిచారు.దీంతో అతడికి అజిత్ విలువైన గిఫ్ట్ ఇచ్చారు.

సుగత్ కోసం ఏకంగా రూ.12.5 లక్షల విలువైన బీఎండబ్ల్యూ సూపర్ బైక్‌ను( BMW Bike ) కొనుగోలు చేశారు అజిత్.టూర్లో తనకు సాయం చేసినందుకు సుగత్ కు బైక్‌ను బహుమతిగా ఇచ్చారు అజిత్.
ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు సుగత్. ఇంత పెద్ద సూపర్ స్టార్‌తో టచ్‌లో ఉండటం తన అదృష్టమని తెలిపారు.
కాగా అజిత్ చేసిన పనికి అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.స్టార్ హీరోలు అయినప్పటికీ ఇంత సింప్లిసిటీ గా ఉండడం కేవలం అతి తక్కువ మంది హీరోలకు మాత్రమే సాధ్యం.
అటువంటి వారిలో అజిత్ కూడా ఒకరు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
