కొత్త బంగ్లా కొన్న అజయ్ దేవగణ్.. ఎన్ని కోట్లంటే..?

బాలీవుడ్ స్టార్ హీరోలు ఈ మధ్య కాలంలో భవంతులను కొనుగోలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 31 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఖరీదైన భవంతిని కొనుగోలు చేయగా తాజాగా అజయ్ దేవగణ్ సైతం ఖరీదైన భవంతిని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు.

ఈ భవంతి ఖరీదు ఏకంగా 60 కోట్ల రూపాయలు అని సమాచారం.అజయ్ దేవగణ్ కూడా ముంబైలోనే ఖరీదైన ఇల్లును కొనుగోలు చేయడం గమనార్హం.

ముంబైలోని ఖరీదైన ప్రాంతంగా పేరు తెచ్చుకోవడంతో పాటు సెలబ్రిటీలు ఎక్కువగా నివశించే ఏరియాగా వార్తల్లో నిలిచిన జుహులో అన్ని సౌకర్యాలు ఉన్న విలాసవంతమైన ఇంటిని అజయ్ దేవగణ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తుండగా ఈ వార్త గురించి అజయ్ దేవగణ్ స్పందించి స్పష్టతనివ్వాల్సి ఉంది.

ఈ ఖరీదైన భవంతి 590 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంటుందని సమాచారం.ప్రస్తుతం అజయ్ దేవగణ్ ముంబైలోనే నివాసం ఉంటున్నారు.

Advertisement

తను నివాసం ఉంటున్న ప్రాంతానికి సమీపంలోనే అజయ్ కొత్త బంగ్లా కొనుగోలు చేసినట్టు సమాచారం.జుహు ప్రాంతంలో ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాసం ఉంటున్నారు.2020 నుంచే కొత్త ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తున్న అజయ్ దేవగణ్ ఎట్టకేలకు తన కోరికను నెరవేర్చుకున్నారని తెలుస్తోంది.2020 సంవత్సరం డిసెంబర్ నెలలో అజయ్ దేవగణ్ కపోలే కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ నుంచి ఈ బంగ్లాకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం.

అజయ్ దేవగణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ తర్వాత అజయ్ దేవగణ్ సినిమాలకు తెలుగులో క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది.అర్జున్ కపూర్ కూడా కొన్ని రోజుల క్రితం ముంబైలో ఫ్లాట్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు