మిస్ ఇండియా గా నిలిచి బాలీవుడ్( Bollywood ) లో హీరోయిన్ గా అడుగు పెట్టి దాదాపు మూడు దశాబ్దాలు అవుతున్నా కూడా ఐశ్వర్య రాయ్ అందం ఏ మాత్రం తగ్గక పోవడంతో పాటు ఆమె క్రేజ్ ఇంకా పెరుగుతూనే ఉంది.ఎంతో మంది కొత్తగా వచ్చి స్టార్ హీరోయిన్స్ గా మారినా కూడా ఐశ్వర్య రాయ్ ని అభిమానించే వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు అంటూ తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థ సర్వేలో వెళ్లడయింది.

ఐశ్వర్య రాయ్ అభిమానుల యొక్క అభిమానం దక్కించుకోవడంలోనే కాకుండా కమర్షియల్ గా కూడా టాప్ పొజిషన్ లో ఉందట.స్టార్ హీరోయిన్స్( Star heroines ) సంపాదన గురించి ఆ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో ఐశ్వర్యరాయ్ యొక్క సంపాదన భారీగా ఉందని వెల్లడయింది.దీపిక పడుకునే, ఆలియా భట్ ఇంకా పలువురు స్టార్స్ కి మాత్రమే చోటు దక్కిన ఆ టాప్ టెన్ జాబితా లో ఐశ్వర్య రాయ్ ఉండడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఈ వయసులో కూడా ఐశ్వర్య రాయ్ ఈ స్థాయిలో సంపాదిస్తుందా అంటూ బాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు ( Movie celebrities )కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఆమెకున్న డిమాండ్ నేపథ్యం లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.అంతే కాకుండా స్టార్ హీరోలు ఏమాత్రం తగ్గకుండా ఐశ్వర్య రాయ్ పారితోషకం దక్కించుకుంటున్న దంటూ జాతీయ మీడియా సంస్థ( National Media Corporation ) తన కథనంలో పేర్కొనడం జరిగింది.
మరో 10 సంవత్సరాల పాటు ఐశ్వర్య రాయ్ ఏమాత్రం క్రేజ్ తగ్గదని ఆమె అందంతో పాటు ఆమెను అభిమానించే వారి సంఖ్య అలాగే ఉంటుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఐశ్వర్య రాయ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆమె ఒక్క పోస్ట్ పెడితే చాలు లక్షల్లో లైక్స్ వస్తాయి.అలాంటి పాపులారిటీని కలిగి ఉన్న ఐశ్వర్య రాయ్ తన కూతురు ని త్వరలోనే నటిగా పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ బాలీవుడ్ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతుంది.
ఆ విషయం ఐశ్వర్య రాయ్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.







