Aishwarya Rai : నిలువెత్తు పోతపోసిన అందం..కానీ 30 ఏళ్లలో చేసింది 48 సినిమాలే !

ఐశ్వర్యరాయ్.( Asihwarya Rai )విశ్వంలోని అరుదైన ఒక అందగతే.

మిస్ వరల్డ్.మోడల్.

హీరోయిన్.ఎంత చెప్పిన ఆమె గురించి తక్కవే.1991 లో మోడలింగ్ ద్వారా రంగప్రవేశం చేసి ఆ తర్వాత కమర్షియల్ ప్రకటన ల్లో కూడా కనిపించింది.

ఆ తర్వాత 1994 లో మిస్ వరల్డ్ గా సెలెక్ట్ అయ్యి ఆమె ఇండియాలో ఇంత అందం కూడా ఉంటుందా అని నిరూపించింది.మిస్ వరల్డ్( Miss World ) కిరీటం తో ఇండియాకు వచ్చిన ఐశ్వర్య కు ఒక మూడేళ్ళ పాటు సినిమాలు ఏమి పెద్దగా రాలేదు.తమిళ్ లో మొదటి చిత్రం ఇరువర్.

Advertisement

ఈ సినిమా ఇద్దరు పేరుతో తెలుగులో కూడా విడుదల అయ్యింది.ఇక ఈ సినిమా తర్వాత ఔర్ ప్యార్ హో గయా అనే హిందీ సినిమాలో నటించింది.

ఇక అప్పటి నుంచి పొన్నియన్ సెల్వన్( Ponniyin Selvan ) రెండు భాగాలతో కలిపి ఆమె కేవలం 48 సినిమాల్లో మాత్రమే నటించింది.ఆమెతో పాటు నటించిన చాల మంది హీరోయిన్స్ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయిన చాల సినిమాల్లోనే కనిపించారు.కానీ ఐశ్వర్య మాత్రం ఎన్ని సినిమాలు చేశామా అని కాదు ఎంత మంచి పాత్రలను ఎంచుకున్నామా అనే విధానాన్ని అవలంబించి ఎక్కువగా సినిమాలో తీయలేదు అని అనుకోవచ్చు.

ఆమె పెళ్లయిన తర్వాత కూడా మంచి సినిమాల్లో నటించే అవకాశం లభించింది.ఇక ఇప్పుడు ఒక కుమార్తె ఉన్నప్పటికి ఏ పాత్రా పడితే ఆ పాత్రా కాకుండా తన పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉందా లేదా అని మాత్రమే చూసుకుని చేస్తుంది.

ఇక ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనించాల్సిన విషయం.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

ఐదేళ్ల క్రితం ఫన్నే ఖాన్ చిత్రం( Fanney Khan )లో నటించగా ఆ తర్వాత పొన్నియన్ లో మాత్రమే నటించడానికి అంగీకరించింది.కానీ ఆమె దగ్గరికి చాల కథలు వస్తున్న కూడా అంత త్వరగా సినిమా అంగీకరించడం లేదు అని తెలుస్తుంది.ఒక వేల ఒప్పుకున్నా కూడా ఆమె రెమ్యునరేషన్ మరియు స్టాఫ్ ఖర్చులు మైంటైన్ చేయడానికి తడిసి మోపెడు అవుతుంది.

Advertisement

ఆలా ఆమె చెప్పినట్టు చేయాలంటే కేవలం పెద్ద సినిమా నిర్మాతలు మాత్రమే ఒప్పుకోగలరు.అందువల్లే ఐశ్వర్య కెరీర్ చాల నిదానంగా వెళ్తుంది.

తాజా వార్తలు