మనలో దాదాపు అందరికీ విమాన ప్రయాణం చేయాలని ఉంటుంది.కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఆ ఆలోచన చేయడానికి కొంతమంది భయపడతారు.
అయితే అలాంటివారు ఇక భయపడాల్సిన అవసరం లేదు.టాటా గ్రూప్ యాజమాన్యంలోని ‘విస్తారా’ ప్రయాణికుల కోసం అదిరిపోయే ఆఫర్స్ తాజాగా ప్రకటించింది.
శనివారం 8వ వార్షికోత్సవం సందర్భంగా దేశీయ, అంతర్జాతీయ ప్రయాణలపై భారీగా డిస్కౌంట్స్ ప్రకటించింది.

ఇక ఛార్జెస్ విషయానికొస్తే, దేశీయ ప్రయాణాలపై ఎకానమీ క్లాస్ ధర రూ.1899 నుంచి ప్రారంభం కాబోతోంది.అలాగే ప్రీమియం ఎకానమీ ధర విషయానికొస్తే రూ.2,699, బిజినెస్ క్లాస్ ధర విషయానికొస్తే రూ.6,999గా వుంది.అలాగే ఇంటర్నేషనల్ ప్రయాణాలపై ఎకానమీ క్లాస్ రూ.13,299, ప్రీమియం ఎకానమీ రూ.16,799, బిజినెస్ క్లాస్ రూ.43,699 గా వున్నాయి.కాబట్టి ప్రయాణికులు వినియోగించుకోగలరని సదరు సంస్థ సదరు ప్రకటనలో పేర్కొంది.
అలాగే, ఎక్స్‌ట్రా సీట్, అదనపు బ్యాగేజీ కోసం టికెట్ కొనుగోలుపై 23 శాతం తగ్గింపు కూడా అందిస్తోంది.

కాగా, విస్తారా ఎయిర్‌లైన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం అయిపోయాయి.ప్రయాణించడానికి సిద్ధంగా వున్నవారు ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ www.airvistara.com ను సందర్శించగలరు.అలాగే iOS, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌ల ద్వారా, లేదంటే ఎయిర్‌పోర్ట్ టిక్కెట్ ఆఫీసులలో, కాల్ సెంటర్ ద్వారా, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీలు, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.కాగా విస్తారా ఆసియా, ఐరోపా దేశాలలో నడుస్తోంది.
కాగా 29 నవంబర్ 2022న, టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాలో విస్తారాను విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది.ఎయిర్ ఇండియా 218 విమానాల సంయుక్త ఫ్లీట్‌తో భారతదేశంలోనే ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ క్యారియర్‌గా అవతరించనుంది.







