భారత వైమానిక దళాలకు ఉగ్రముప్పు,ఇంటెలిజెన్స్ హెచ్చరిక!

తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తుంది.భారత వైమానిక కేంద్రాలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందంటూ ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించారు.

 Air Forcechief Wantspreparations To Ensure Grounddefence Of Airbases Pathankot-TeluguStop.com

వైమానిక కేంద్రాల్లో పఠాన్ కోట్ తరహా దాడులు చేసేందుకు పాక్ ఉగ్రవాదులు యత్నిస్తున్నారు అంటూ ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు.ఈ క్రమంలో భారత వాయుసేన దళాలను అప్రమత్తం చేసినట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా వెల్లడించారు.

ఢిల్లీలోని వైమానిక కేంద్రంలో రెండు రోజుల పాటు జరుగుతున్న వాయుసేన కమాండర్ల సమావేశంలో ధనోవా మాట్లాడుతూ భారత వాయుసేన దళాలు అనుక్షణం అప్రమత్తంగా, ఉగ్రవాద దాడులను తిప్పికొట్టేందుకు సన్నద్ధంగా ఉండాలని కోరారు.ఆర్టికల్ 370 రద్దు తరువాత పాకిస్తాన్ రెచ్చగొట్టేలా బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తుందని ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

పఠాన్ కోట్ లో చోటుచేసుకున్న ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే.అయితే సరిగ్గా అలాంటి ఉగ్రదాడి చోటుచేసుకునే ప్రమాదం ఉందంటూ ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించడం తో భారత వైమానిక దళాలు అప్రమత్తమయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube