RP Patnaik: ఎస్పీ బాలుకి ఇచ్చిన మాటను నెరవేర్చలేకపోయాను.. ఆర్పీ పట్నాయక్ కామెంట్స్ వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు సంగీత దక్షకుడు ఆర్పి పట్నాయక్( RP Patnaik ) గురించి వ్యతిరేకంగా చెప్పాల్సిన పని లేదు.మొదట నీకోసం సినిమాతో సంగీత దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆర్పి పట్నాయక్ ఆ తర్వాత ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 Ahimsa Music Director Rp Patnaik About Sp Balasubrahmanyam-TeluguStop.com

కాగా అప్పట్లో ఆర్పీ పట్నాయక్ కంపోజ్ చేసిన చాలా పాటలు బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచాయి.అలా సినిమా ఇండస్ట్రీలో దాదాపు ఐదారు ఏళ్ల పాటు సంగీత దర్శకుడిగా ఒక వెలుగు వెలిగారు.

ఆ తర్వాత కాస్త జోరును తగ్గించేశారు.కాగా ఆర్పీ పట్నాయక్ డైరెక్టర్ తేజ సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు.

Telugu Ahimsa, Teja, Geetika Tiwari, Rp Patnaik, Tollywood-Movie

2006లో విడుదలైన లక్ష్మీ కళ్యాణం సినిమా తర్వాత మళ్లీ ఇన్ని రోజులకు వీరిద్దరి కాంబినేషన్లో అహింస సినిమా వచ్చింది.అహింస సినిమాతో( Ahimsa Movie ) సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు ఆర్పీ పట్నాయక్.అభిరామ్ దగ్గుపాటి,గీతిక తివారి కలిసిన నటించిన ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది.ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.

సినిమా ఉన్నా లేకపోయినా రోజుకి 18 గంటలు పని చేస్తాను.కన్నడలో కొన్ని సినిమాలు చేస్తున్నాను.

అలాగే దర్శకత్వంకు సంబధించిన కొన్ని కథలు రాస్తున్నాను.అయితే నాకు మ్యూజిక్ ఎక్కువ పేరు తీసుకొచ్చింది.

కానీ ఒక సందర్భంలో మానేశాను.

Telugu Ahimsa, Teja, Geetika Tiwari, Rp Patnaik, Tollywood-Movie

బాలు గారు నేను ఎక్కడ కనిపించినా మళ్లీ సంగీతం ఎప్పుడు మొదలు పెడుతున్నావ్ అని అడిగేవారు.అడిగిన ప్రతిసారీ చేస్తాను గురువు గారు అని చెప్పేవాడిని.సమస్య ఏమిటంటే నాకు కథ నచ్చితేనే చేస్తాను.

మధ్యలో చాలా వచ్చాయి.కానీ చేయాలనిపించలేదు.

బాలు గారు వెళ్లిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చిన మాట నెరవేర్చలేకపోయాననే గిల్ట్ ఎక్కువ అయ్యింది.బాలు గారు( SP Balasubrahmanyam ) నాకు స్ఫూర్తి.

ఆయన పాటపై ఉన్న అభిమానంతో పరిశ్రమలోకి వచ్చాను.ఆయనకి ఇచ్చిన మాట తీర్చలేకపోయాననే బాధ ఎక్కువైంది అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు ఆర్పి పట్నాయక్.

ఒకసారి తేజను కలిసి మళ్లీ మ్యూజిక్ చేయాలి అది బాలు గారి కోరిక అని చెప్పాను.ఆ తర్వాత కొద్ది రోజులకు తేజ ఫోన్ చేసి సినిమా చేస్తున్నాం.

అదే అహింస అని నాతో తెలిపారు అని చెప్పుకొచ్చాడు ఆర్పి పట్నాయక్.సంగీత దర్శకుడి గానే కాకుండా ఇకపై నటుడిగా కూడా కొనసాగించాలనుకుంటున్నాను అని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube