సెలబ్రిటీస్ జీవితం ఎలా ఉంటుంది, వారు ఏం చేస్తారు, ఏం తింటారని తెలుసుకోవడానికి అందరికి ఎంతో ఆసక్తిగా ఉంటుంది.వారు అభిమానించే స్టార్సే గరిట పట్టి వంట చేస్తే? చూడముచ్చటగా ఉంటుంది కదా? అందుకే మన ఆహ చెఫ్ మంత్రా సీజన్ 2తో అందరిని మరోసారి అలరించడానికి సెప్టెంబర్ 30 నుండి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వచ్చేస్తుంది.8 ఎపిసోడ్స్ కలిగిన ఈ షో ను ముందుండి నడిపించడానికి మంచు లక్ష్మి వచ్చేస్తుంది.నటిగా, దర్శకురాలిగా, రచయితగా, నిర్మాతగా, ఫిలాన్తర్ ఫిస్ట్ గా, ఎన్ ఎఫ్ టీ న్ఎఫ్టి కలెక్టర్ లక్ష్మి మంచి భోజన ప్రియురాలు కూడా.
అలాగే, ఈ షో ద్వారా సెలబ్రిటీస్ వంట చేయడమే కాదు, వారు ఎలాంటి ఆహరం ఇష్టపడతారు, ఎలాంటి ఆహారం తీసుకుంటారు, వీటితో పాటు ఎంతో ఫన్ మరియు ఎంటర్టైన్మెంట్ అందిచబోతున్నారు.
ఈ షో లాంచ్ గురించి లక్ష్మి మంచు మాట్లాడుతూ,మంచు ఫ్యామిలీలో అందరం కూడా భోజనప్రియులమే.
ఎన్నో విషయాలు లంచ్ లేదా డిన్నర్ టేబుల్ మీద అందరు కలిసి ఉన్నపుడు మాట్లాడుతారు.మంచి ఫుడ్ ఉంటే ఆరోజు చాల బాగా గడిచిపోతుంది.
అలాంటి ఒక ఫుడ్ షో ని నేను హోస్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది.అందరూ ఈ షోను ఇష్టపడతారని ఆశిస్తున్నానుమరి ఇంకా ఎందుకు ఆలస్యం, ఈ షో సెప్టెంబర్ 30 నుండి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తప్పక చూడండి.