సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నందమూరి బాలకృష్ణ ( Balakrishana ) హీరోగా మాత్రమే కాకుండా తనలో ఓ మంచి వ్యాఖ్యాత కూడా దాగి ఉన్నారని నిరూపించుకున్నారు.ఇన్ని రోజులు హీరోగా నటించినటువంటి ఈయన మొదటిసారి అన్ స్టాపబుల్ ( Unstoppable ) అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక ఈ కార్యక్రమాన్ని బాలయ్య తన మాట తీరుతో ఎంతో మంచి సక్సెస్ చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఆహా( Aha ) లో ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇప్పటికే మూడు సీజన్లను( Unstoppable Show Seasons ) పూర్తి చేసుకొని ఎంతో విజయాన్ని అందుకుంది.ఈ మూడు సీజన్లో భాగంగా పలువురు స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యారు.అలాగే పలువురు రాజకీయ నాయకులకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
ఇలా స్టార్ సెలబ్రిటీలు( Star Celebrities ) అందరిని బాలయ్య ప్రశ్నలు వేస్తూ వారి నుంచి సమాధానాలు రాబట్టడంతో ఈ కార్యక్రమం భారీ స్థాయిలో సక్సెస్ అందుకుంది.ఇలా మూడు సీజన్లో విజయవంతం కాగా మరో సీజన్ ఏర్పాటు చేయడానికి కూడా మేకర్స్ సిద్ధంగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఆన్ స్టాపబుల్ సీజన్ 4 త్వరలోనే ప్రారంభం కాబోతుందని ఆహా ఇటీవల అధికారకంగా వెల్లడించారు.అన్ స్టాపబుల్ సీజన్ ఫోర్ కార్యక్రమంలో భాగంగా మరికొంతమంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.ఇప్పటివరకు మూడు సీజన్ల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన బాలయ్య మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ కార్యక్రమానికి మొదటి గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు ఏంటి అనే విషయాలన్నీ కూడా త్వరలోనే తెలియనున్నాయి.
ప్రస్తుతం బాలకృష్ణ బాబి( Bobby ) డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు.అయితే ప్రస్తుతం ఏపీ ఎన్నికలు ( AP Elections ) జరుగుతున్న నేపథ్యంలో ఈయన సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చి రాజకీయాలలో బిజీగా మారిపోయారు.