వణికిపోతున్న ఢిల్లీ...లాక్ డౌన్ దిశగా అడుగులు

కరోనా సెకండ్ వేవ్ కు ప్రపంచ దేశాలు వణికిపోతున్న విషయం తెలిసిందే.

గతేడాది ఇదే రోజు చైనా లో పురుడుపోసుకున్న ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను తీవ్రస్థాయి లో ముంచెత్తింది.

వ్యాక్సిన్‌ ఇంకా తయారీ దశలో ఉండగానే దేశ రాజధాని ఢిల్లీ లో రెండోదశ వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తోంది.మొదటి దశ విజృంభణ నుంచి ఇంకా కోలుకోకముందే మరోసారి వ్యాప్తి చెందడం భయాందోళనకు గురిచేస్తోంది.

ఇప్పటికే పలు దేశాల్లో ఈ సెకండ్ వేవ్ కారణంగా రెండో విడత లాక్‌డౌన్‌ విధించగా.మరికొన్ని దేశాలు పాక్షిక ఆంక్షలు విధిస్తూ దీనిని కంట్రోల్ చేయాలనీ చూస్తుంది.

బ్రిటన్‌, ఫ్రాన్స్‌, అమెరికాలో కొత్త కేసులు నమోదు కావడంతో ప్రపంచ దేశాలను కరోనా భయం వెంటాడుతోంది.ఇక భారత్‌లోనూ కరోనా కేసులు పెరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తుంది.

Advertisement
Once Again Lockdown In Delhi , Delhi, Corona Virus, COVID-19, Corona Cases, Delh

మొన్నటివరకు ఒక రకంగా అదుపులోనే ఉన్నట్లు అనిపించినప్పటికీ కూడా ఈ మహమ్మారి దేశ రాజధాని ఢిల్లీ లో విజృంభిస్తూనే ఉంది.తాజాగా అక్కడ నమోదవుతున్న కేసులు ప్రభుత్వాలను కలవరపెడుతున్నాయి.

తాజాగా గడిచిన వారంరోజుల్లో ప్రతిరోజు 4వేలకు పైగా పాజటివ్‌ కేసులు వెలుగుచూస్తుండడం తో మరింత ఆందోళన మోడలింది.మరోవైపు మృతుల సంఖ్య కూడా భారీగా పెరగడం అధికార యంత్రానికి చెమటలు పుట్టిస్తోంది.

దీపావళి పండగ సీజన్, చలికాలం రావటంతో కేసుల సంఖ్య రోజు రోజుకి రెట్టింపు అవుతోంది.

Once Again Lockdown In Delhi , Delhi, Corona Virus, Covid-19, Corona Cases, Delh

ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవ్వగా, ఢిల్లీ సర్కార్ మరిన్ని చర్యలకు పాల్పడాలని యోచనలో ఉంది.మరికొద్ది రోజులు గనుక ఇలానే కొనసాగితే మరోసారి లాక్ డౌన్ విధించడానికి కూడా వెనుకాడకూడదు అని కేజ్రీవాల్ సర్కార్ భావిస్తుంది.ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా కోరినట్లు తెలుస్తుంది.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

ఒకవేళ కేంద్ర సర్కార్ గనుక మరోసారి లాక్ డౌన్ కు అనుమతిని ఇస్తే మాత్రం తప్పకుండా హాట్ స్పాట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలుపరుస్తామని కేజ్రీ వాల్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు