ప్రస్తుతం త్రివిక్రం తో సినిమా ఫిక్స్ చేసుకున్న మహేష్ తన నెక్స్ట్ సినిమా అంటే 29వ సినిమా రాజమౌళి డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.మహేష్, రాజమౌళి కాంబో సినిమా భారీ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది.
ఈ సినిమా తర్వాత రాజమౌళి ఏ హీరోతో సినిమా చేస్తాడా అన్న డౌట్ ఉంది.అయితే జక్కన్న మహేష్ తర్వాత తన హీరోని ఫిక్స్ చేసుకున్నాడని టాక్.
ఇంతకీ అతనెవరు అంటే రాజమౌళి ఫేవరెట్ హీరో ఎన్.టి.ఆర్ తోనే మరో సినిమా ప్లాన్ చేస్తున్నారట.
ఆల్రెడీ ఎన్.టి.ఆర్ తో ఇప్పటికే స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ రీసెంట్ గా ఆర్.ఆర్.ఆర్ సినిమాలు చేసిన జక్కన్న మరోసారి ఎన్.టి.ఆర్ తోనే సినిమా చేసేందుకు ఇంట్ట్రెస్ట్ చూపిస్తున్నాడట.తారక్ కూడా జక్కన్న సినిమా అంటే మారు మాట మాట్లాడడు.ఎన్.టి.ఆర్ 30వ సినిమా కొరటాల శివతో చేస్తున్నాడు.ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో తారక్ సినిమా ఉంది.ఆ రెండు సినిమాల తర్వాత రాజమౌళి, ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుందట.రాజమౌళి సినిమా అంటేనే భారీతనం ఉంటుంది.మరి తారక్ తో ఎలాంటి అద్భుతాన్ని చేస్తాడో చూడాలి.







