ఐదేళ్ల విరామం తరువాత దర్శకుడు విజయ్ కుమార్ మరోసారి సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.2013 లో గుండె జారీ గల్లంతయ్యిందే చిత్రం,అలానే 2014 లో ఒక లైలా కోసం వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి ప్రసంశలు అందుకున్న విజయ్ గత కొంత కాలంగా సినిమాలకి దూరంగా ఉన్నాడు.అయితే ఐదేళ్ల విరామం తరువాత ఇప్పుడు తాజాగా హీరో రాజ్ తరుణ్ తో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.2014 లో ఒక లైలా కోసం చిత్రం చేసిన తరువాత ప్రేమ, పెళ్లి విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఎలాంటి ప్రాజెక్ట్ చేయలేకపోయారు.
అయితే ప్రస్తుతం అన్ని పరిస్థితులు చక్కబడడం తో ఇప్పుడు దృష్టి అంతా కూడా సినిమాలపైనే పెట్టినట్లు తెలుస్తుంది.తాజాగా రాజ్ తరుణ్ హీరో గా ఒప్పుకున్నా ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలను విజయ్ కుమార్ కొండ జరుపుకోగా, ఆగస్ట్ నుండి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు.
శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా,అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం.మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.