దళపతి 68 లో ఖుషి హీరోయిన్.. ఇదే నిజమైతే?

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay Joseph ) ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ”లియో” సినిమా( Leo movie ) చేస్తున్నాడు.ఈ సినిమా షూట్ ”వారిసు” రిలీజ్ కాగానే స్టార్ట్ చేయగా ఇప్పటికే 80 శాతానికి పైగానే పూర్తి చేసారు.

 The Actress Paired With Vijay Details, Thalapathy Vijay, Trisha, Lokesh Kanagar-TeluguStop.com

అందుకే అక్టోబర్ 19న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది.

Telugu Magicactress, Jyothika, Thalapathy, Thalapathyvijay, Trisha-Movie

ఇక ఈ సినిమా తర్వాత నెక్స్ట్ తన 68వ సినిమాను విజయ్ కస్టడీ డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో చేయనున్నాడు అని ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది.కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నట్టు ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.అధికారిక ప్రకటన అలా వచ్చిందో లేదో ఈ సినిమా నుండి ఒక్కో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వస్తుంది.

ఈ సినిమాలో ప్రముఖ నటుడు ఎస్ జె సూర్య విలన్ రోల్ లో నటిస్తున్నట్టు వార్తలు రాగా ఇప్పుడు హీరోయిన్ కూడా ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ ను కాకుండా సీనియర్ హీరోయిన్ ను తీసుకోనున్నారు అని టాక్ గట్టిగానే వినిపిస్తుంది.కోలీవుడ్ మీడియా చెబుతున్న ప్రకారం.

ఈ సినిమాలో విజయ్ సరసన ఖుషి హీరోయిన్ నటిస్తున్నట్టు టాక్.ఖుషి హీరోయిన్ అంటే భూమిక కానీ సమంత కానీ అనుకుంటున్నారా.

అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.ఈ సినిమాలో తమిళ్ లో ఖుషి సినిమా రీమేక్ లో నటించిన విజయ్ – జ్యోతిక జంట అక్కడ బాగా ఫేమస్ అయ్యారు.

Telugu Magicactress, Jyothika, Thalapathy, Thalapathyvijay, Trisha-Movie

మరి ఇప్పుడు ఆ ఖుషి భామ జ్యోతిక హీరోయిన్( Jyotika is the heroine ) గా ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు.ఇదే నిజమైతే ఈ అమ్మడికి ఇది పెద్ద ఆఫర్ అనే తెలుస్తుంది.మరి ఈ ఖుషి జంట చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమాలో నటించ బోతుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరిన్ని అధికం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube