జోబైడన్ నిర్ణయాలతో ఆఫ్గనిస్థాన్ అల్లకల్లోలం

అగ్రరాజ్యం అమెరికా అద్యక్షుడు జోబైడన్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయనకు అన్నీ ప్రతికూల పవనాలే వీస్తున్నాయా? అనాలోచితమైన నిర్ణాలు, ఆయనకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేసే వ్యక్తిత్వం తో అధికార వర్గంతో పాటు, సన్నిహితుల్లోనూ వ్యతిరేక భావనలు తొంగి చూస్తున్నాయా? కాస్తా లోతుగా తరచి చూస్తే, .జోబైడన్ వ్యవహార తీరు అర్ధమవుతుందంటున్నారు అమెరికన్ సిటిజన్లు.

 Afghanistan Is In Turmoil With President Joe Biden Decisions Details, Afghanista-TeluguStop.com

ఆఫ్గానిస్థాన్ లో ని ప్రజలందరూ అమెరికా నీడలో హ్యాపీ ఊపిరి పీల్చుకుంటుంటే కొంపలేవో మునిగిపోతున్నట్టు అక్కడి సేనలను ఊపసంహరించారు.దాంతో రెచ్చిపోయిన తాలిబన్లు ఎంతకు తెగించారో.అంతకంటే ఎక్కువగా అక్కడి సిటిజన్లు రెచ్చిపోయారు.ఫలితంగా ఆఫ్దానిస్తాన్ అల్ల కల్లోలం అయిపోయిన విషయం మనకు తెలిసిందే.

తాలిబన్ల నీడలో తమకు రక్షణ లేదంటూ విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఎయిర్ పోర్టు లో విమాన చక్రలు పట్టుకుని ఎగిరిపోయిన జనాలు మనం అంత త్వరగా ఎలా మర్చిపోతాం.అన్ని వేల ఎత్తులో ఎగురుతున్న విమానం పై నుండి నేల మీద కు రాలిపోయిన ఆఫ్గనిస్థానీయుల ఉసురు పోసుకున్నారంటూ జో బైడన్ పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ సౌదీ అరేబియా పర్యటనలో భాగంగా సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌ , బైడెన్‌ మధ్య జరిగిన సంభాషణ ఇపుడు చర్చనీయాంశంగా మారింది.గతంలో ఇద్దరి మధ్య దెబ్బతిన్న సంబంధాలే అందుకు కారణమంటున్నారు విశ్లేషకులు.

వీరిద్దరూ షేక్‌ హ్యాండ్స్‌ ఇచ్చుకోవడానికి బదులు ‘ఫిస్ట్‌ బంప్‌’ చేసుకొన్నారు.ఆతర్వాత వీరిద్దరి కోసం ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో సుమారు రెండున్నర గంటల పాటు పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

Telugu Afghanistan, Fuel, Mohammadbin, Joe Biden, Saudi Arabia, Saudi, Talibans-

సౌదీ రాజు సల్మాన్‌ అనారోగ్యంతో ఉండటంతో.యువరాజ్‌ ఎంబీఎస్‌ అనధికారిక రాజుగా వ్యవహరిస్తున్నారు.ఆదే సమయంలో అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్‌ అధికారాన్ని, అప్పుడే చేపట్టారు.ఆతర్వాత సౌదీ యువరాజుతో మాట్లాడేందుకు నిరాకరించడంతో అసలు కథ ఇక్కడే మొదలైంది.సౌదీ రాజుతోనే మాట్లాడతానని తేల్చి చెప్పడంతో, ఆమాట ఎంబీఎస్ మనసులో నాటుకు పోయింది.అప్పటికే ఖషోగ్జీ హత్యకు సంబంధించి సౌదీ యువరాజుపై పరోక్షంగా పరుష వ్యాఖ్యలు కూడా చేశారు జోబైడన్.

Telugu Afghanistan, Fuel, Mohammadbin, Joe Biden, Saudi Arabia, Saudi, Talibans-

తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టగానే అర్జెంటుగా అమెరికా వైఖరి మారిపోయింది.ఇప్పుడు సౌదీ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందనుకున్నారు యువరాజు ఎంబీఎస్. చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ఉత్పత్తి పెంచాలని కోరేందుకు శ్వేతసౌధం నుంచి సౌదీ, యూఏఈ లతో సంప్రదింపులు జరిగాయి.అమెరికా నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ కు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు సౌదీ యువరాజు.

సౌదీ,యూఏఈ దేశాధి నేతలు బైడెన్‌తో మాట్లాడేందుకు నిరాకరించారు.

Telugu Afghanistan, Fuel, Mohammadbin, Joe Biden, Saudi Arabia, Saudi, Talibans-

అమెరికాలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరగడం మొదలుపెట్టింది.మరికొన్ని రోజుల్లో అమెరికాలో కీలకమైన మిడ్‌టర్మ్‌ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో చమురు ధరల స్థిరీకరణకు ప్రయత్నించేందుకు బైడెన్‌ సౌదీకి వెళ్లినట్లు సమాచారం.

గత జూన్‌లో బైడన్ పర్యటన వివరాలు ప్రకటించగానే 17శాతం చమురు ధరలు తగ్గినట్లు అధికారిక సమాచారం.తాజాగా బైడన్ సౌదీ పర్యటనలో చమురు ఉత్పత్తి పెంచుతామని ఎటువంటి హామీ సౌదీ రాజు ఇవ్వలేదని అధికారిక సమాచారం.

ప్రస్తుతం ఆయన పర్యటన ముగించుకుని అమెరికాకు వచ్చేసారు.ఫలితం ఏంటో ఎవరికీ చేప్పలేక బైడన్ గప్ చుప్ అయ్యిపోయారు.

మరికొన్ని వారాల్లో సౌదీ చర్యలు తీసుకొంటుందనే అశాభావం మాత్రమే వ్యక్తంచేస్తూ మాట దాట వేసినట్లు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సైబర్‌ సెక్యూరిటీ, క్లీన్‌ ఎనర్జీ అంతరిక్ష రంగం, వైద్యరంగం, కమ్యూనికేషన్లకు సంబంధించి 18 ఒప్పందాలు జరగినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube