ఏపీలో విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన మరియు బీజేపీ( TDP BJP Janasena ) సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కివచ్చింది.పొత్తుల్లో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, జనసేన 21 మరియు బీజేపీ పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఆయా పార్టీ అధినేతలు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

అలాగే రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha Elections ) టీడీపీ 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుండగా బీజేపీ ఆరు స్థానాలు, జనసేన రెండు స్థానాల్లో బరిలో దిగనుంది.ఈ మేరకు ఈ నెల 14వ తేదీన టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించనుంది.కాగా ఏపీలో టీడీపీ, జనసేన మరియు బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లనున్నాయన్న సంగతి తెలిసిందే.







