టాటా, అంబానీలకు ధీటుగా గోల్డ్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చిన బిర్లాలు!

ఈ ప్రపంచంలో బంగారం ( Gold ) అంటే ఇష్టం లేనివారు ఎవరుంటారు చెప్పండి? మరి మన భారతీయుల గురించి ఇక వేరే చెప్పాలా? బంగారం అంటే ఇక్కడ పడి చస్తారు అని చెప్పుకోవచ్చు.అందుకే ఇక్కడ ప్రతి పట్టణంలో గల్లీకొక గోల్డ్ షాప్ కొలువుదీరుతుంది.

 Aditya Birla Group Announces Its Entry Into The Branded Jewellery Retail Busines-TeluguStop.com

ఇక పెద్ద వ్యాపారుల సంగతి అందరికీ చెందినదే.బడాబాబులందరూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బంగారంలో పెట్టుబడులు పెడుతూ వుంటారు.

ఈ క్రమంలో తాజాగా ఆదిత్య బిర్లా గ్రూప్( Aditya Birla Group ) సైతం బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Telugu Tanishq, Aditya Birla, Ambanis, Gold Birla, Kumarmangalam, Novel Jewels,

కాగా, దీనికోసం బిర్లాలు దాదాపు రూ.5000 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు భోగట్టా.దేశవ్యాప్తంగా ఇందుకోసం ప్రత్యేక రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది బిర్లా అండ్ గ్రూప్ అఫ్ కంపెనీ.

టాటాలు, అంబానీలు ఆల్రెడీ బంగారం వ్యాపారంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.ఇందుకోసం కంపెనీ ‘నావెల్ జ్యువెల్స్’( Novel Jewels ) పేరుతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తోంది.ప్రత్యేకమైన డిజైన్-లీడ్, అధిక-నాణ్యత ఆభరణాలు, బలమైన ప్రాంతీయ టచ్ ద్వారా కస్టమర్ అనుభవాన్ని మార్చడమే ఈ వెంచర్ లక్ష్యమని కంపెనీ చాలా స్పష్టంగా తెలియజేస్తోంది.తాము చేస్తున్న ఈ ప్రయత్నం వ్యూహాత్మక పోర్ట్‌ఫోలియో ఎంపికలో భాగమని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా( Kumar Mangalam Birla ) వెల్లడించారు.

Telugu Tanishq, Aditya Birla, Ambanis, Gold Birla, Kumarmangalam, Novel Jewels,

ఇది కొత్త గ్రోత్ ఇంజిన్‌లలోకి ప్రవేశించడానికి, తమ ఉనికిని మరింత విస్తరించడానికి దోహదపడుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.ఇప్పటికే ఈ వ్యాపార విభాగంలో టాటా గ్రూప్ తనిష్క్, అంబానీలు రిలయన్స్ జ్యువెల్స్ పేరుతో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న సంగతి విదితమే.కాగా భారతదేశంలో ఆభరణాల మార్కెట్ 2025 నాటికి సుమారు 90 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.అలాగే రత్నాలు, ఆభరణాల మార్కెట్ దేశ GDPకి దాదాపు 7 శాతం కాంట్రిబ్యూచ్ చేస్తోంది.

ప్రస్తుతం బిర్లా గ్రూప్ లోహాల నుంచి ఫ్యాషన్ రిటైల్ వరకు అనేక రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube