పుట్టినరోజు వేడుకల్లో ఆదిపురుష్ టీమ్..ఎవరిదంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ 3D సినిమా ఒకటి.

ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా ఇతిహాస గాధ రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.

సన్నీ సింగ్ లక్ష్మణ పాత్రలో నటిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా సెట్స్ లో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఇంతకీ సెట్స్ లో బర్త్ డే వేడుకలు ఎవరివా అని ఆలోచిస్తున్నారా.ఆదిపురుష్ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్న సన్నీ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా సెట్స్ లో పుట్టిన రోజు వేడుకలు జరిపారు.

ఈ వేడుకల్లో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంది.ఈ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అందులో ఒక ఫొటోలో ప్రభాస్ సన్నీ సింగ్ కు కేక్ తినిపిస్తూ కనిపించాడు.

ఆ ఫొటోలో డైరెక్టర్ ఓం రౌత్ కూడా ఉన్నాడు.ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇటీవలే ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11, 2022 న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.ఇక ఈ సినిమాను ఓం రౌత్, భూషణ్ కుమార్, కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ప్రభాస్ ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా కూడా చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలను ప్రభాస్ ఒకేసారి సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.అంతేకాదు రెండు సినిమాలను ఒకే సమయంలో పూర్తి చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తుంది.ఇక ఈ సినిమాలతో పాటు ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా కూడా చేస్తున్నాడు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఇక ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతుంది.

తాజా వార్తలు