తెలుగు వర్షన్ లో 'జై శ్రీరామ్' సాంగ్.. గూస్ బంప్స్ ఆగయా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్ ( Adipurush )’ ఒకటి.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.

 Adipurush 'jai Shri Ram' Lyrical Motion Poster  , Jai Shri Ram , Om Raut , Kriti-TeluguStop.com

ఇటు హిందీ మార్కెట్ లో మాత్రమే కాదు తెలుగు మార్కెట్ దగ్గర కూడా చాలా కాలం తర్వాత మరో మాసివ్ ఓపెనర్ గా నిలిచే సినిమాగా ఇది రాబోతుంది.ఈ అవైటెడ్ సినిమా రిలీజ్ కు దగ్గర పడుతున్న కొద్దీ సినిమా నుండి ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.

జనవరిలోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా జూన్ 16న వాయిదా వేశారు.ఈ మధ్యనే శ్రీరామనవమి సందర్భంగా ఒక పోస్టర్, హనుమాన్ జయంతి సందర్భంగా మరో పోస్టర్ రిలీజ్ చేయగా అవి పర్వాలేదు అనిపించాయి.

మునుపటి కంటే వీఎఫ్ఎక్స్ వర్క్స్ పరంగా మేకర్స్ మరింత ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ తెలుగు వర్షన్ సాంగ్ రిలీజ్ చేసారు.

Telugu Adipurus, Bollywood, Jai Shri Ram, Kriti Sanon, Lyrical Poster, Om Raut,

ఈ ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.”జై శ్రీరామ్”( Jai Shri Ram )అనే సాంగ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే ఈ సినిమా నుండి ఈ రోజు ఫైనల్ గా ఫస్ట్ సింగిల్ తెలుగు వర్షన్ కూడా రిలీజ్ చేసారు.రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన సాహిత్యం అజయ్ – అతుల్ సంగీతంలో మిళితం అయ్యి జై శ్రీరామ్ అనే సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది అనే చెప్పాలి.

Telugu Adipurus, Bollywood, Jai Shri Ram, Kriti Sanon, Lyrical Poster, Om Raut,

మేకర్స్ వదిలిన చిన్న బిట్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ లభిస్తుంది.దీంతో డెఫినెట్ గా ఈ సినిమా హైప్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది.ఈ సాంగ్ తర్వాత ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఖచ్చితంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది అని నమ్ముతున్నారు.

ఇక రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించగా టి సిరీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది.

Telugu Adipurus, Bollywood, Jai Shri Ram, Kriti Sanon, Lyrical Poster, Om Raut,

ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో( Prabhas ) నటిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటించింది.అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.

చూడాలి మరి ఈ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube