ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన పెద్ద సినిమాలలో ఒకటి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ( Prabhas )హీరో గా నటించిన ‘ఆద్రిపురుష్’( Adripurush ) చిత్రం.రామాయణం ఇతిహాసం ని 3D లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ తో తీశామంటూ మొదటి నుండి చెప్పడం తో ఈ చిత్రం పై అంచనాలు మొదటి నుండే భారీ స్థాయిలో ఉండేది.
మన దేశం లో రామాయణం ముక్కు మొహం తెలియనొల్లని పెట్టి భారీ బడ్జెట్ తో తీసినా ఓపెనింగ్స్ అదిరిపోతాయి.అలాంటిది ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ ఈ చిత్రం లో శ్రీ రాముడి పాత్ర పోషించాడు అంటే ఇక అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
అందుకే ఈ సినిమాకి విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉండేవి.
ఆ అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా మొదటి మూడు రోజులు భారీ స్థాయి వసూళ్లను రాబట్టినా, నాల్గవ రోజు నుండి మాత్రం అతి దారుణంగా వసూళ్లు పడిపోయాయి.అలా మూడు రోజుల్లో 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం క్లోసింగ్ లో 400 కోట్ల రూపాయిలను గ్రాస్ ని రాబట్టింది.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలి, అంటే 300 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కచ్చితంగా రావాలి అన్నమాట.
కానీ ఫుల్ రన్ లో ఈ చిత్రానికి కేవలం 200 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగ, వంద కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది.థియేట్రికల్ పరంగా ఈ రేంజ్ డిజాస్టర్ గా నిల్చిన ఈ సినిమా కనీసం ఓటీటీ ( OTT )లో అయినా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటుందని అందరూ అనుకున్నారు.
ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ సంస్థ( Amazon Prime ) హిందీ వెర్షన్ మినహా, మిగిలిన అన్నీ భాషలకు కలిపి కొనుగోలు చేసింది.హిందీ వెర్షన్ ని మాత్రం నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది.రెస్పాన్స్ అంతంత మాత్రం గానే వచ్చింది.నెట్ ఫ్లిక్స్ లో పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చినప్పటికీ, అమెజాన్ ప్రైమ్ లో మాత్రం ఈ చిత్రానికి చాలా పూర్ రెస్పాన్స్ వచ్చింది.
సాధారణంగా ఎంత చెత్త సినిమా అయినా, అమెజాన్ ప్రైమ్ లో ఒక రెండు వారాల పాటుగా నెంబర్ 1 స్థానం లో కొనసాగుతుంది.కానీ ‘ఆదిపురుష్’ చిత్రం మాత్రం అప్పుడే నాల్గవ స్థానానికి పడిపోయింది.
వ్యూస్ ఇప్పటి వరకు వంద మిలియన్ వాచ్ మినిట్స్ ని అందుకోలేదట.ఒక స్టార్ హీరో సినిమా, అది కూడా రామాయణం మీద తీసిన సినిమాకి ఇంత చెత్త రెస్పాన్స్ వస్తుందని కలలో కూడా ఊహించలేదు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.