విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ 'కోబ్రా' నుండి అధీర లిరికల్ వీడియో విడుదల

చియాన్ విక్రమ్ కధానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా’.సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

 Adheeraa Lyrical Video From Vikram, Ajay Gnanamuthu, Seven Screen Studios Cobra-TeluguStop.com

ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ సినిమాలోని అధీరా అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.ఏఆర్ రెహమాన్ ఈ పాటని ఫుట్‌టాపింగ్, రాకింగ్ నంబర్‌ గా కంపోజ్ చేశారు.

ఈపాట కథానాయకుడి పాత్ర యొక్క ఉన్నతమైన లక్షణాల వర్ణిస్తూ అలరించింది.హరిప్రియ, నకుల్ అభ్యంగర్ ఈ పాటని ఎనర్జిటిక్ గా ఆలపించగా రాకేందు మౌళి సాహిత్యం అందించారు.

శ్రీనిధి శెట్టి కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రంలో విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాలో ఇండియన్ వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించడం విశేషం.

మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.సాంకేతిక విభాగం విషయానికి వస్తే.ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.హరీష్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్వీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ‘కోబ్రా’ చిత్రం హక్కులను సొంతం చేసుకున్నారు.ఆగస్ట్ 11న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

తారాగణం: విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి తదితరులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube