తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కొత్తగూడెం ఓఎస్డిగా టి.సాయి మనోహర్ ఈ రోజు భాద్యతలు స్వీకరించారు.
జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ గారిని ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.వరంగల్ జిల్లాకు చెందిన టి.సాయి మనోహర్ 1996 బ్యాచ్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా భర్తీ అయ్యి అనంతరం 2007 సంవత్సరంలో ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొంది కరీంనగర్ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించారు.2013లో డిఎస్పీగా ప్రమోషన్ పొంది హైదరాబాద్ మరియు మహబూబ్ నగర్ జిల్లాలో పని చేశారు.ఇటీవల అడిషనల్ ఎస్పీ గా పదోన్నతి పొంది తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కొత్తగూడెం ఓఎస్డీ గా ఈ రోజు భాద్యతలు స్వీకరించారు.